Joe Biden | జో బైడెన్ ఆరోగ్యం అద్భుతంగా ఉంది.. స్పష్టం చేసిన వైట్ హౌస్ వైద్యుడు
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మానసిక స్థితిపై ఇటీవలే రకరకాల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ (Kevin O'Connor) స్పష్టతనిచ్చారు.
Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) మానసిక స్థితిపై ఇటీవలే రకరకాల ఊహాగానాలు వినిపించిన విషయం తెలిసిందే. అధ్యక్షుడికి పార్కిన్సన్ (Parkinson) ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై వైట్‌హౌస్‌లో అధ్యక్షుడి వైద్యుడు డాక్టర్ కెవిన్ (Kevin O’Connor) స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం అధ్యక్షుడి ఆరోగ్యం అద్భుతంగా ఉందని తెలిపారు.
అధ్యక్షుడి ఆరోగ్య పరిస్థితిపై న్యూయార్క్ పోస్ట్ పత్రిక డాక్టర్ కెవిన్‌ను ప్రశ్నించింది. అందుకు ఆయన బదులిస్తూ.. ‘అధ్యక్షుడి హెల్త్ అద్భుతంగా ఉంది. ఆయన మెదడు బాగా పనిచేస్తోంది. అంతా అనుకుంటున్నట్లు ఆయనకు పార్కిన్సన్కు సంబంధించిన ఎటువంటి సమస్యా లేదు’ అని స్పష్టం చేశారు. ఆయన పదవీ కాలం ముగిసేనాటికి ఏమైనా మార్పులు ఉంటాయా అని విలేకరు ప్రశ్నించగా.. ‘పదవీకాలం ముగిసేనాటికి అధ్యక్షుడి ఆరోగ్యంలో గణనీయమైన మార్పులు ఏమీ ఉండకపోవచ్చు’ అని తెలిపారు.
మతిమరుపు, పొరపాట్లతో అధ్యక్షుడు బైడెన్ ఇటీవలే నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలిచిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒకరిపేరు పలకడానికి బదులు మరొకరి పేరు పలకడం, పలు సందర్భాల్లో ఆయన ఎటూ కదలకుండా చలనం లేని రీతిలో నిలుచుండిపోవడం వంటివి జరిగాయి. దీంతో బైడెన్ ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వినిపించాయి. 83 ఏళ్ల బైడెన్ వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఈ క్రమంలోనే మరోసారి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన బైడెన్‌పై పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వచ్చింది. దీంతో అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగుతున్నట్లు బైడెన్ ప్రకటించారు. ఇక ఆయన స్థానంలో ప్రస్తుత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ పోటీకి సిద్ధమవుతున్నారు. ఆమెకు డెమోక్రట్ల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడా లభిస్తోంది. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచారు.
Also Read..
Supreme Court | కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు నోటీసులు.. ఎందుకంటే..?
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

