Sunita Williams: ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ రాక మరింత ఆలస్యం.. స్టార్‌లైనర్ థ్రస్టర్లను పరీక్షిస్తున్న నాసా
Sunita Williams: సునీతా విలియమ్స్ ఇంకా స్పేస్ స్టేషన్లోనే ఉన్నది. బోయింగ్ స్టార్‌లైనర్ వ్యోమనౌక థ్రస్టర్లలో తలెత్తిన సమస్యను నాసా ఇంజినీర్లు పరిశీలిస్తున్నారు. సునీతాతో పాటు మరో ఆస్ట్రోనాట్ విల్మోర్ ఎప్పుడు భూమికి వస్తారన్న విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఆ ఇద్దరి రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది.
టెక్సాస్: అమెరికా-భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) ఇంకా అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు. ఆమె రాక మరింత ఆలస్యం అవుతున్నది. ఇప్పటికే ఆమె తిరుగుప్రయాణం నెల రోజుల ఆలస్యమైంది. తిరిగి భూమికి వచ్చే బోయింగ్ వ్యోమనౌకలో సమస్యలు తలెత్తడంతో .. ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్ .. స్పేస్ స్టేషన్లోనే చిక్కుకున్నారు. అంతరిక్ష కేంద్రానికి వెళ్లి జూన్ మధ్యలోనే తిరిగి రావాల్సిన ఇద్దరు వ్యోమగాలు.. బోయింగ్ వ్యోమనౌకలో థ్రస్టర్ ఫెయిల్యూర్‌తో అక్కడే ఉండిపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ క్యాప్సూల్‌లో.. హీలియం వాయువు లీకవుతున్నట్లు కూడా గుర్తించారు. దీంతో ఆ ఇద్దరు వ్యోమగాములను నాసా అక్కడే ఉంచేసింది.
వ్యోమగాములు ఎప్పుడు తిరిగి వస్తారో తెలియదని, ఇంకా ఆ తేదీని నిర్ణయించలేదని నాసా కమర్షియల్ క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ తెలిపారు. స్టార్‌లైనర్‌లోనే విల్మోర్, విలియమ్స్‌ను తీసుకురావడం తమ లక్ష్యం అని పేర్కొన్నారు. స్టార్‌లైనర్ వ్యోమనౌకలో సమస్యలు ఉత్పన్నమైన నేపథ్యంలో.. బ్యాకప్ ఆప్షన్లను కూడా పరిశీలిస్తున్నట్లు స్టిచ్ వెల్లడించారు. స్పేస్ఎక్స్కు చెందిన డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా కూడా వ్యోమగాములను వెనక్కి తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. నాసా వద్ద ఎప్పుడూ ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉంటాయన్నారు.
స్టార్‌లైనర్‌లో ఉన్న అయిదు థ్రస్టర్లు విఫలం అయ్యాయని, జూన్ ఆరవ తేదీన స్పేస్స్టేషన్తో డాకింగ్ సమయంలో ఈ సమస్య వచ్చినట్లు ఇంజినీర్లు చెప్పారు. దీంట్లో నాలుగు థ్రస్టర్లను రీయాక్టివేట్ చేసినట్లు నాసా పేర్కొన్నది. స్టార్‌లైనర్‌లోని థ్రస్టర్లను ఈ వారం చివరలో పరీక్షిస్తామని, మరింత డేటా సేకరించి సమీక్ష నిర్వహించనున్నట్లు బోయింగ్ అధికారి మార్క్ నప్పి తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | తెలంగాణ ఒక నిఖార్సయిన ఉద్యమకారున్ని కోల్పోయింది : కేసీఆర్
Bandla Ganesh | బండ్ల గణేశ్‌కు జైలుశిక్ష.. రూ. 95 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు కీలక తీర్పు
Tyson Naidu Teaser | మాస్ యాక్షన్ విందుతో బెల్లంకొండ ‘టైసన్ నాయుడు’ టీజర్.!
Siddipeta | పోలీసుల దిగ్బంధనంలో సిద్దిపేట.. ఎక్కడికక్కడే బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్
Jasprit Bumrah | టెస్టుల్లో బుమ్రా అరుదైన రికార్డు.. అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్-10 భారత బౌలర్ల జాబితాలో చోటు..!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

