US Senator | భారత్‌తో సంబంధాలు చాలా కీలకం.. పాక్‌కు సాయాన్ని నిషేధించాలి.. అమెరికా కాంగ్రెస్‌లో కీలక బిల్లు
US Senator | మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం (Treat India Like Its Top Allies) ఉందని అమెరికా సెనేటర్ (US Senator) అభిప్రాయపడ్డారు.
US Senator | మిత్రదేశాలైన జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్‌ను చూడాల్సిన అవసరం (Treat India Like Its Top Allies) ఉందని అమెరికా సెనేటర్ (US Senator) అభిప్రాయపడ్డారు. ఈ మేరకు అమెరికన్ కాంగ్రెస్ (America Congress )లో కీలక సభ్యుడు మార్కో రుబియో గురువారం ఓ బిల్లు ప్రవేశపెట్టారు. భారత్‌తో సైనిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవాల్సిన అసవరం ఉందని బిల్లులో పేర్కొన్నారు.
భారతదేశ ప్రాదేశిక సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని ఈ బిల్లు గుర్తు చేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తేలితే పాకిస్థాన్‌కు భద్రతా సాయాన్ని నిషేధించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సాంకేతికత బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్‌కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని బిల్లు ప్రతిపాదిస్తోంది.
మరోవైపు ఇండో – పసిఫిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణ వైఖరిని అనుసరిస్తోందని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశ పెట్టిన బిల్లు స్పష్టం చేస్తోంది. ఇది ఆ ప్రాంతంలోని అమెరికా భాగస్వామ్య దేశాల సార్వభౌమాధికారాన్ని, స్వయంప్రతిపత్తికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకోవాలంటే భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించడం చాలా కీలకమని వెల్లడించింది.
అయితే, ఈ బిల్లు చట్టరూపం దాల్చడంపై ఆందోళన నెలకొంది. ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా బిల్లు గట్టెక్కడం కష్టమని నిపుణులు చెబుతున్నారు.
In order to strengthen our partnership with India, it’s essential we increase our strategic relationship w/ New Delhi. 🇺🇲 🇮🇳
Introduced a bill to best support India as they continue to face aggression from Communist China.https://t.co/QVF1gU7TqP
— Senator Marco Rubio (@SenMarcoRubio) July 25, 2024
Also Read..
Heavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. నదులను తలపిస్తున్న రహదారులు
Syed Maqbool | దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల నిందితుడు సయ్యద్ మక్బూల్ మృతి
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

