Donald Trump | రష్యా చమురుపై ఆంక్షల బిల్లుకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్.. భారత్‌పై 500 శాతం సుంకాలు..!
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
Donald Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపే విషయంలో రష్యాపై ఒత్తిడి పెంచేందుకు ద్వైపాక్షిక ఆంక్షల బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే.. రష్యా నుంచి చమురు (Russia Oil Trade), యురేనియం కొనుగోలు చేసే భారత్, చైనా, బ్రెజిల్ వంటి దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధించనున్నారు. ఈ బిల్లుపై వచ్చే వారం ఓటింగ్ జరగనున్నట్లు లిండ్సే గ్రాహమ్ తెలిపారు.
రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తూ.. ఉక్రెయిన్‌తో యుద్ధానికి నిధులు సమకూరుస్తున్న భారత్, చైనా, బ్రెజిల్ దేశాలను కట్టడి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం (స్థానిక కాలమానం ప్రకారం) అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగిన కీలక సమావేశం అనంతరం లిండ్సే గ్రాహమ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో వెల్లడించారు. గత కొన్ని నెలలుగా డెమోక్రాట్ సెనేటర్ రిచర్డ్ బ్లూమెన్‌థాల్‌తో కలిసి తాను పనిచేస్తున్న రష్యా ఆంక్షల బిల్లుకు ట్రంప్ అనుమతి ఇచ్చారని ఆయన చెప్పారు. ఉక్రెయిన్ శాంతి చర్చలు కొనసాగుతున్న సమయంలో ఈ బిల్లు తీసుకురావడం వ్యూహాత్మకంగా సరైన సమయమని గ్రాహమ్ అభిప్రాయపడ్డారు.
Also Read..
Congress | అంబర్‌నాథ్‌లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లపై వేటు.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు
Maharashtra | కాంగ్రెస్‌తో జట్టుకట్టిన బీజేపీ!..మహారాష్ట్ర అంబర్‌నాథ్‌లో అనూహ్య పరిణామం
గుజరాత్లో 57% ఇండ్లకు నల్లాలే లేవు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

