Kanwar Yatra | అందుకే ఆ నిర్ణయం.. ‘కన్వర్’ మార్గంలో నేమ్‌ప్లేట్ల ఏర్పాటుపై వివరణ ఇచ్చిన యూపీ ప్రభుత్వం
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది.
Kanwar Yatra | కన్వర్ యాత్ర (Kanwar Yatra) మార్గంలో తినుబండారాలు విక్రయించేవారు తమ యజమానుల పేర్లను తప్పనిసరిగా ఆహారశాలలపై ప్రదర్శించాలన్న ఉత్తర్వులను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం (Uttar Pradesh government) సమర్థించుకుంది. తీర్థయాత్ర శాంతియుతంగా, క్రమబద్ధంగా సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించింది.
కన్వర్ యాత్ర మార్గంలోని హోటళ్లు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలన్న యూపీ, ఉత్తరాఖండ్ ప్రభుత్వాల ఆదేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. సుప్రీం ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఆహారశాలలు, తినుబండారాల పేర్ల విషయంలో సంశయం తలెత్తుతోందని యాత్రికులు ఫిర్యాదు చేశారని ప్రభుత్వం చెప్పింది. వారి ఆందోళనలను పరిష్కరించేందుకే ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపింది. అందుకు అనుగుణంగా పోలీసులు చర్యలు తీసుకున్నారని వెల్లడించింది.
కన్వర్ యాత్రా మార్గంలోని స్టాల్స్, హోటల్స్ యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్లపై తమ పేర్లను వేయించాలని ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్దేశాలు జారీచేసింది. ఆ తర్వాత ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉత్తరప్రదేశ్‌ను అనుసరించాయి. దాంతో ఈ నిర్దేశాలను సవాల్ చేస్తూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై సోమవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. ‘ఆహారాన్ని అమ్మేవాళ్లు వారు అమ్మే ఆహార వివరాలు ప్రదర్శించొచ్చు కానీ తమ యజమానులు, సిబ్బంది పేర్లు ప్రదర్శించాలని ఒత్తిడి చేయకూడదు’ అని తెలిపింది.
ఈ మేరకు యూపీ, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఇచ్చిన నిర్దేశాలపై స్టే విధించింది. అంతేగాక సమాధానం ఇవ్వాలంటూ ఆ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. కేసు తుదపరి విచారణను ఈ నెల 26కి (ఇవాళ్టికి) వాయిదా వేసింది. ఆహారపదార్థాలను అమ్ముకునే వ్యాపారులు నేమ్ ప్లేట్లపై పేర్లను వేయించాలని బలవంతపెట్టడం సబబు కాదని కోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై ఇవాళ మరోసారి సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.
Also Read..
Heavy Rain | ఢిల్లీలో భారీ వర్షం.. నదులను తలపిస్తున్న రహదారులు
PM Modi: ద్రాస్ సెక్టార్లో విజయ్ దివస్.. కార్గిల్ హీరోలకు మోదీ సెల్యూట్.. వీడియో
Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల వైస్ చీఫ్‌లు నివాళి
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

