న్యూఢిల్లీ: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.. ఇవాళ కార్గిల్ యుద్ధ అమరవీరులకు నివాళి అర్పించారు. ఢిల్లీలోని జాతీయ వార్ మెమోరియల్ వద్ద ఆయన పుష్పగుచ్ఛం ఉంచి నివాళి ప్రకటించారు. కార్గిల్ యుద్ధం జరిగి నేటితో 25 ఏళ్లు ముగిసింది. విజయ్ దివస్ సందర్భంగా.. ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఎన్ రాజా సుబ్రమణి, నేవీ వైస్ చీఫ్ వైస్ అడ్మిరల్ కే స్వామినాథన్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్, సీఐఎస్సీ లెఫ్టినెంట్ జనరల్ జాన్సన్ పీ మాథ్యూ.. జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళి అర్పించారు. ప్రత్యేక పుష్పగుచ్ఛాలను సమర్పించారు.
#WATCH | Indian Army Vice Chief Lt Gen N Raja Subramani, Navy Vice Chief Vice Admiral K Swaminathan, Indian Air Force Vice Chief Air Marshal AP Singh & CISC Lt Gen Johnson P Mathew laid wreaths and paid tribute to the heroes of the Kargil War at National War Memorial in Delhi,… pic.twitter.com/icMg4B9gDZ
— ANI (@ANI) July 26, 2024
లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్.. కార్గిల్ వీరులకు నివాళి అర్పించారు. స్మృతికా వార్ మెమోరియల్ వద్ద ఆయన పుష్పగుచ్ఛాన్ని ఉంచారు. విజిటర్స్ బుక్లో సంతకం చేశారు.