హైదరాబాద్ : అవినీతి నిరోధక అధికారులకు ( ACB ) మరో అవినీతి చేప చిక్కింది . హైదరాబాద్‌లోని బొగ్గుకుంట ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో ఇన్స్పెక్టర్గా( Endowment inspector ) పనిచేస్తున్న ఆకవరం కిరణ్‌కుమార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడ్డాడు.
హైదరాబాద్‌లోని బాగ్ అంబర్‌పేట్‌లోని భూమికి సంబంధించి సర్వే నివేదిక జారీ కోసం అధికారులను బాధితుడు సంప్రదించాడు. దీంతో ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ రూ.1.50 లక్షలు డిమాండ్ చేయడంతో మొదటి విడతగా రూ. 50వేలు కార్యాలయ ఆవరణతో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు.
విధి నిర్వహణలో అవినీతి, అక్రమాలకు పాల్పడినందుకుగాను అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతికి పాల్పడితే 1064 అనే టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.