Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం (Heavy Rain) ముంచెత్తింది. రాజధాని ప్రాంతంలో శుక్రవారం ఉదయం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఢిల్లీలోని నౌరోజీ నగర్, భికాజీ కామా ప్లేస్, శాంతి మార్గం, ఆశ్రమం, ఆనంద్ విహార్, మలై మందిర్ ఏరియా సహా నోయిడాలోని అనేక ప్రాంతాల్లో తెల్లవారుజామున వర్షం కురిసింది. దీంతో నగరం మొత్తం జలమయమైంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షం నీరు వచ్చి చేరింది. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కాగా, రాబోయే రెండు గంటల్లో రాజధానిలో భారీ వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. అదేవిధంగా జులై 28వ తేదీ వరకూ రాజధానిని వర్షాలు ముంచెత్తే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ మేరకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఈ వర్షం కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత మెరుగైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం.. ప్రస్తుతం రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 50గా ఉంది.
#WATCH | Delhi: Residents of the National Capital woke up to waterlogging and heavy rain showers this morning.
(Visuals from Shanti Path) pic.twitter.com/uRbahIGq3u
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Delhi: The city faced traffic jams and waterlogging in various areas after heavy rains this morning.
(Visuals from Bhikaji Cama Place) pic.twitter.com/YdKRWZnzoS
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Delhi: Slow traffic movement observed at the Motibagh Ring Road as a result of heavy rains and waterlogging pic.twitter.com/RihGDvvl8O
— ANI (@ANI) July 26, 2024
#WATCH | Delhi: The city faced traffic jams and waterlogging in various areas after heavy rains this morning.
(Visuals from Ashoka Road) pic.twitter.com/sRBVflkbLu
— ANI (@ANI) July 26, 2024
Also Read..
Kargil Vijay Diwas: కార్గిల్ విజయ్ దివస్.. రక్షణ మంత్రి, త్రివిధ దళాల వైస్ చీఫ్లు నివాళి
KTR | ఇందారం వద్ద గోదావరిని పరిశీలించిన కేటీఆర్..
Google Doodle | పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ స్పెషల్ డూడుల్