KTR | ఇందారం వద్ద గోదావరిని పరిశీలించిన కేటీఆర్..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్లో లోయర్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే.
రామగుండం: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన రెండో రోజు కొనసాగుతున్నది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) నేతృత్వంలో హైదరాబాద్ నుంచి బయల్దేరిన ప్రజా ప్రతినిధుల బృందం.. గురువారం సాయంత్రం కరీంనగర్లో లోయర్ మానేరు రిజర్వాయర్‌ను పరిశీలించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీ నుంచి కన్నెపల్లికి బయల్దేరి వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద నీటి ప్రవాహం లేక ఎండిపోయిన గోదావరి నదిని పరిశీలించారు. మరికాసేపట్లో కన్నెపల్లి పంపు హౌజ్‌కు చేరుకోనున్నారు. పంప్ హౌస్‌ను పరిశీలించిన అనంతరం మీడియాతో కేటీఆర్ మాట్లాడుతారు. ఉదయం 10.30 గంటలకు మేడిగడ్డ బ్యారేజీని సందర్శిస్తారు. అక్కడ గోదావరి నది ఉధృతిని పరిశీలిస్తారు.
కాగా, గోదావరిఖనిలో సింగరేణి క్వాటర్ల కూల్చివేత బాధితులు కేటీఆర్‌ను కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గోదావరిఖని లక్ష్మినగర్ షాపింగ్ కాంప్లెక్స్ డెవలప్మెంట్ అంటూ సింగరేణి క్వాటర్లు కూల్చివేశారని మెరపెట్టుకున్నారు. 82 క్వాటర్లకు కరెంటు, నీళ్లు కట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని చెప్పారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్‌సింగ్ అరాచక పాలన చేస్తున్నారని తెలిపారు. ఏ ప్రజా ప్రతినిధులు ఇలాంటి పనులు చేయలేదని ఆవేదన వ్యక్తంచేశారు. తమకు జరిగిన అన్యాయంపై అసెంబ్లీలో చర్చించాలని కేటీఆర్‌ను వేడుకున్నారు. బాధితుల విజ్ఞప్తికి కేటీఆర్ సానుకూలంగా స్పందిచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

