Google Doodle | పారిస్ ఒలింపిక్స్.. గూగుల్ స్పెషల్ డూడుల్
Google Doodle | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. విశ్వక్రీడలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని సీన్ నదిలో ప్రపంచ క్రీడల (Olympic Games) ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ వినూత్నంగా డూడుల్ (Google Doodle) ప్రదర్శించింది.
Google Doodle | ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. విశ్వక్రీడలకు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లోని సీన్ నదిలో ప్రపంచ క్రీడల (Olympic Games) ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ వినూత్నంగా డూడుల్ (Google Doodle) ప్రదర్శించింది. సందర్భానికి తగినట్టు తమ డిస్ప్లేలో ఫొటోలు, వీడియాలతో కార్టూన్ యానిమేషన్‌ను ప్రదర్శించే గూగుల్.. పారిస్ ఒలింపిక్స్‌ను కూడా తమదైన స్టైల్లో చూపించింది. కొన్ని పక్షలు నదిలో ఈదుతూ క్రీడలు ఆడుతున్నట్లుగా డూడుల్ రూపొందించి. దానిపై క్లిక్ చేస్తే.. పారిస్ ఒలింపిక్స్‌కు సంబంధించిన వివరాలతో కొత్త పేజ్ ఓపెన్ అవుతున్నది. విశ్వక్రీడలకు సంబంధించిన లేటెస్ట్ వార్తలు, క్రీడల షెడ్యూల్, గెలుపోటములకు సంబంధించిన వివరాలను అందిస్తున్నది. అయితే ఈ డూడుల్‌ను రూపొందించింది ఎవరనే విషయాన్ని మాత్రం వెళ్లడించలేదు. జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి.
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు సమయం ఆసన్నమైంది. గతానికి భిన్నంగా ఎలాంటి ఆంక్షలు, నిబంధనలకు తావు లేకుండా స్వేచ్చ, స్వాత్రంత్యానికి ప్రతీకగా పారిస్ విశ్వక్రీడల సంబరానికి వేళయైంది. దశాబ్దం తర్వాత ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిస్తున్న పారిస్..ప్రపంచ క్రీడాకారులకు ఆత్మీయ స్వాగతం పలుకుతున్నది. కరోనా నిబంధలన నడమ జరిగిన టోక్యో(2020)కు పూర్తి భిన్నంగా సీన్ నది తీరాన విశ్వక్రీడల మహోత్సవానికి అట్టహాసంగా తెరలేవనుంది.
చారిత్రక ఈఫిల్ టవర్ సాక్షిగా 10,500 మంది ప్లేయర్లు పోటీపడుతున్న ఒలింపిక్స్‌లో ఆరంభ వేడుకలు గతాన్ని తలదన్నే విధంగా చేసేందుకు పారిస్ ప్రభుత్వం నడుము బిగించింది. సుదీర్ఘమైన సీన్ నది పరివాహక ప్రాంతాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దుతూ ప్రారంభ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. వివిధ దేశాల ప్లేయర్లకు, అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేసింది. తమ దేశ ఘనమైన వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ సాంస్కృతిక కార్యక్రమాలతో పారిస్ నగరం క్రీడాభిమానులను అలరించనుంది. ఫ్రెంచ్ ప్రముఖ థియేటర్ డైరెక్టర్ థామ్ జాలీ పారిస్ నగరాన్ని ఓపెన్ ఎయిర్ థియేటర్‌గా మారుస్తూ కార్యక్రమాల రూపకల్పన చేశారు.
‘మస్కట్’గా టోపీ
ఈసారి ఒలింపిక్ మస్కట్‌గా అలరిస్తున్న ‘ఫ్రీజ్’ వెనుక పెద్ద కథే ఉంది. చిన్న పిల్లలు ఎంతో ఇష్టపడే క్రిస్మస్ తాత పెట్టుకునే టోపీని పోలి ఉన్న ఈ మస్కట్‌ను ‘ఫ్రీజ్’ అని పిలుస్తారు. ఫ్రెంచ్ సంప్రదాయంలో ‘ఫ్రీజియన్ క్యాప్’కు ప్రఖ్యాత ఫ్రెంచ్ విప్లవంతో సంబంధముంది. 17వ శతాబ్దంలో చోటు చేసుకున్న ఫ్రెంచ్ విప్లవంలో ఉద్యమకారులు, ప్రజలు ఈ టోపీని స్వేచ్ఛకు చిహ్నంగా ధరించేవారట. పురాతన గ్రీకు చిత్రాలలోనూ ఈ క్యాప్ ఆనవాళ్లు కనిపిస్తాయి. ‘క్రీడలు ప్రజల జీవితాలను మార్చగలవు’ అనే థీమ్‌తో దీనిని రూపొందించారు.
భారత్ పోటీపడే క్రీడాంశాలు
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, గోల్ఫ్, హాకీ, జూడో, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టెన్నిస్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్.
- టోక్యోలో 33 క్రీడాంశాలలో 339 మెడల్ ఈవెంట్స్‌ను నిర్వహించగా పారిస్‌లో 32 క్రీడాంశాలు, 329 ఈవెంట్స్ జరుగుతాయి.
- 1900, 1924 తర్వాత సరిగ్గా వందేండ్లకు మళ్లీ ఆ దేశం ఆతిథ్య హక్కులను దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Europe Protests | అట్టుడుకుతున్న యూరప్.. అనేక దేశాల్లో వెల్లువెత్తిన నిరసనలు
Solar-Powered Cart | వీధి వ్యాపారుల కోసం సౌర శక్తి బండి.. ఆవిష్కరించిన ఐఐటీ ఖరగ్‌పూర్
Leap Hour | లీప్ సెకండ్‌కు స్వస్తి.. మూడు దశాబ్దాల చర్చకు తెర
Army Officer Wife | చైనా ఏజెంట్లకు సున్నిత సమాచారం.. సైనికాధికారి భార్యపై ఎఫ్ఐఆర్
Akhilesh Yadav | నకిలీ ఓట్లతో గెలువాలని చూస్తున్న బీజేపీ.. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

