Telangana Budget | అత్తెసరు కేటాయింపులు.. పారిశ్రామిక రంగానికి మొండిచెయ్యి!
పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. వరాల జల్లు కురిపిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన పరిశ్రమల వర్గాలకు చుక్కెదురైంది.
- రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపు అత్తెసరు
- 3,500 కోట్ల ఎంఎస్ఎంఈ సబ్సిడీ బకాయిలకు 2,762 కోట్లతో సరి
- ఆందోళన వ్యక్తం చేసిన ఇండస్ట్రీ వర్గాలు
- బడ్జెట్ కేటాయింపులో కొన్ని ముఖ్యమైవని (రూ. కోట్లలో)
- 969.40 గ్రామీణ, చిన్నతరహా పరిశ్రమలకు
- కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ 593.22
- 593.22 స్టేట్ సెక్టర్ స్కీమ్స్
- పరిశ్రమల అభివృద్ధికి ప్రోత్సాహకాలు 500
Telangana Budget | హైదరాబాద్, జూలై 26(నమస్తే తెలంగాణ): పారిశ్రామిక రంగానికి రాష్ట్ర ప్రభుత్వం మొండిచెయ్యి చూపించింది. వరాల జల్లు కురిపిస్తారని ఎంతో ఆశతో ఎదురుచూసిన పరిశ్రమల వర్గాలకు చుక్కెదురైంది. ఇప్పటికే సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ఏర్పాటు చేసుకున్నవారికి సబ్సిడీల రూపంలో చెల్లించాల్సిన రూ.3,500 కోట్లు చెల్లించకపోగా..ఈసారి బడ్జెట్లో రూ.2,762 కోట్లు కేటాయింపులు జరిపింది.
అన్ని రంగాల వారిని ఆదుకుంటామని ప్రతిజ్ఞ చేసిన రేవంత్ సర్కార్ కేవలం కంటితుడుపు చర్యలకు మొగ్గుచూపింది. కోట్ల మంది ఉపాధి పొందుతున్న చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలపై రాష్ట్ర సర్కార్ శీతకన్ను వేసింది. దీంట్లో గత కొంతకాలంగా చిన్న సంస్థలకు సబ్సిడీలు కూడా చెల్లించడం లేదు. ఈ బడ్జెట్లోనైనా భారీగా నిధులు కేటాయిస్తారని ఆశించిన వారికి నిరాశే ఎదురైంది.
టీ-ఫ్రైడ్, టీ-ఐడియా, స్టాండప్ ఇండియా తదితర పథకాల కింద లబ్దిదారులకు ఇవ్వాల్సిన సబ్సిడీలు రూ.3,500 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బకాయిలు చెల్లించాలని లబ్దిదారులు గత కొంతకాలంగా పరిశ్రమల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నప్పటికీ సర్కార్ కరుణించడం లేదు. దీనిపై ప్రభుత్వ వర్గాలు స్పందిస్తూ..ప్రభుత్వం నిధులు విడుదల చేసినవెంటనే చెల్లిస్తామని చెబుతున్నారు.
ఈ బడ్జెట్లోనైనా పాత బకాయిల కోసం నిధులు కేటాయించకపోవడంతో ఇండస్ట్రీ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ, చిన్న తరహా పరిశ్రమలకు, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, స్టేట్ సెక్టార్ స్కీమ్స్, ప్రోత్సాహాకాలకు కలుపుకొని మొత్తంగా రూ.2,762 కోట్ల నిధులు కేటాయించింది. ఇందులో గ్రామీణ, చిన్న తరహా పరిశ్రమలు, స్టేట్ సెక్టార్ స్కీంలకు కేటాయించిన నిధులను పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు రాయితీల రూపంలో ఖర్చు చేయనున్నారు.
ఎంఎస్ఎంఈ పాలసీకి మోక్షం ఎప్పడు?
ఎంఎస్ఎంఈ పాలసీకి ఇప్పట్లో మోక్షం లభించే అవకాశాలు కనిపించడం లేదు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు నూతన పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించినప్పటికీ ఇప్పటికి కార్యరూపం దాల్చలేదు. ఇప్పటికే ఉన్నతాధికారులు ఈ కొత్త పాలసీని సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినప్పటికీ, బడ్జెట్లో దీనికి చోటు లేకుండా పోయింది. కొత్త విధానం వచ్చే వరకు ప్రస్తుత విధానమే కొనసాగుతుందని అధికారవర్గాలు స్పష్టంచేశాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

