హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పీజీ ప్రవేశాలకు నిర్వహించే కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్ (సీపీగెట్) -2024 నోటిఫికేషన్ విడుదలైంది. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. సీపీగెట్ రిజిస్ట్రేషన్స్ ఈ నెల 18 నుంచి ప్రారంభంకానున్నాయి. జూలై 5 నుంచి ఈ పరీక్షలను ఆన్లైన్లో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తారు. దరఖాస్తులు సహా పూర్తి వివరాల కోసం www.osmania.ac.in, www. ouadmissions. com, www.cpget.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో సగానికి పైగా సీట్లు నిండడం లేదు. ఏటా ఇదే పరిస్థితి ఉంటోంది. ఈ ఏడాది 10శాతం సీట్లు నిండని కాలేజీలను బ్లాక్ చేసే ఆలోచనలో అధికారులు ఉన్నట్టు తెలుస్తుంది.
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపునకు వెయ్యి రూపాయల ఆలస్య రుసుముతో ఈ నెల 16 వరకు ఇంటర్‌బోర్డు అవకాశామిచ్చింది. ఫీజు చెల్లించని వారు గురువారంలోగా ఆన్లైన్లో పరీక్ష ఫీజు చెల్లించాలని ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతిఓజా సూచించారు.