‘మీరు ప్రతి వర్షకాలంలోనూ చూస్తారు, అల్లాహ్ ఆకాశం నుండి నీళ్లు కురిపించాడు. నిర్జీవంగా పడి ఉన్న భూమిలో దానిద్వారా ప్రాణం పోశాడు. నిశ్చయంగా ఇందులో వినేవారికి ఒక నిదర్శనం ఉన్నది’
(ఖుర్ఆన్ 16:65)
‘నేల పూర్తిగా ఏమీ లేని చదరపు మైదానంలా ఉంటుంది. అందులో జీవమున్న ఏ సూచనా గోచరించదు. గడ్డి పరకా కానరాదు. తీగలు, రెమ్మలు, ఆకులు, పువ్వులూ కనిపించవు, ఎటువంటి కీటకాలూ కనబడవు. ఇంతలో వర్షకాలం వస్తుంది. తొలకరి వానలకే నేలపైన జీవం ఊటలయి పెల్లుబుకడం మొదలవుతుంది. భూమి పొరల్లో దాగి ఉన్న అనేక వేళ్లు ఎకాఎకీన బతికి నిలబడతాయి. ప్రతిదానికి పచ్చిక మెరుస్తుంది.
ఆ పచ్చిక, నిరుడు వానకాలంలోనూ పుట్టి చచ్చిపోయిందే. అసంఖ్యాకమైన కీటకాలు వేసవిలో నామరూపాల్లేకుండా సమసిపోయినవి అకస్మాత్తుగా కిందటి వానకాలంలో మాదిరిగానే ఠీవిగా బయటపడతాయి. ఇదంతా దైనందిన జీవితంలో మాటిమాటికీ చూస్తూనే ఉంటాం. ఇన్నిన్ని నిదర్శనాలు చూశాక కూడా ‘మరణించిన తర్వాత మానవులనందరినీ అల్లాహ్ తిరిగి బతికించి లేపుతాడన్న మాట వింటే మీకు విస్మయం కలుగుతుందేమిటీ?’ అని ఖురాన్ ప్రశ్నిస్తుంది.
…? ముహమ్మద్ ముజాహిద్, 96406 22076