TGSRTC | ఇటీవల వివిధ సోషల్ మీడియాలో TGSRTC బస్సుల్లో దివ్యాంగులకు సంబంధించి వస్తున్న వార్తలపై టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం స్పష్టత ఇచ్చింది. దివ్యాంగులందరికీ బస్సుల్లో పూర్తిగా ఉచిత ప్రయాణం కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి కొత్త ఉత్తర్వులు జారీ చేయలేదని టీజీఎస్ ఆర్టీసీ పేర్కొన్నది.
సోషల్ మీడియాలో వస్తున్న ఈ వార్త పూర్తిగా అవాస్తవమని తెలిపింది. ఇలాంటి తప్పుడు వార్తలను సోషల్ మీడియాలో ప్రచారం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ప్రజలు ఇటువంటి పుకార్లను నమ్మవద్దని, ఏదైనా కొత్త నిర్ణయం తీసుకుంటే పత్రికా ప్రకటన ద్వారా లేదా అధికారిక TGSRTC వెబ్సైట్ ద్వారా గాని వెల్లడించడం జరుగుతుందని టీజీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటనలో స్ఫష్టం చేసింది.
Toxic | యష్ ‘టాక్సిక్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘తబాహి’ రిలీజ్.. ఆడియోతోనే అంచనాలు రెట్టింపు!