భూగర్భ జలాలు ఇంకా తగ్గుతాయి
బోర్లు, బావుల్లో ఇప్పుడు కొంత నీరు ఉన్నప్పటికీ మున్ముందు ఇంకిపోయి భూగర్భ జలాలు ఇంకా తగ్గే ప్రమాదం ఉందని డీఏవో పులయ్య అన్నారు. అందుకని, ఇప్పుడున్న నీటి వనరులను చూసి రైతులెవరూ వరి పంటను వేయవద్దని సూచించారు.
- రైతులెవరూ వరి పంట వేసి ఇబ్బందులు పడొద్దు: డీఏవో పుల్లయ్య
కూసుమంచి, జూలై 23: బోర్లు, బావుల్లో ఇప్పుడు కొంత నీరు ఉన్నప్పటికీ మున్ముందు ఇంకిపోయి భూగర్భ జలాలు ఇంకా తగ్గే ప్రమాదం ఉందని డీఏవో పులయ్య అన్నారు. అందుకని, ఇప్పుడున్న నీటి వనరులను చూసి రైతులెవరూ వరి పంటను వేయవద్దని సూచించారు. ఎల్ నినో ప్రభావంతో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గితే వరి పంటకు నీరు అందదని అన్నారు. కాబట్టి వరి వేయకుండా స్వల్పకాలిక పంటలు వేసుకోవాలని రైతులను కోరారు.
కూసుమంచి మండలం కిష్టాపురంలో గురువారం జరిగిన రైతు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పెసర, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలను వేసుకోవాలని సూచించారు. రైతులు పొలాలు, చేలల్లో పల్లపు ప్రాంతాల్లో ఫారంపాండ్స్ తీసుకోవాలన్నారు.సర్పంచ్ సైదులు, ఏవో రామడుగు వాణి, ఏఈవో వాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

