హనుమకొండ, జూలై 23 : ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడు దల చేయాలని, జీవో 7, 8, 9ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ తీశారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్ షిప్ బకాయిల సమస్య విద్యారంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టిందన్నారు. రూ.11వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు.
సీఎం రేవంత్రెడ్డి విద్యారంగ సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిల వల్ల ఇప్పటికే అనేక విద్యా సంస్థలు మూతపడగా, మరిన్ని మూతపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. సంఘం జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్, డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వేణుమాధవ్, బీసీ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మా ట్లాడారు. కార్యక్రమంలో మాస్టర్జీ విద్యా సంస్థల అధినేత సంగంరెడ్డి సుందర్రాజు యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఊటూరి ప్రణీత్ గౌడ్, ఉపాధ్యక్షులు జకుల భానుప్రసాద్, శ్రీపతి వినయ్, కొండ చరణ్, సహాయ కార్యదర్శులు చిర సాయిచంద్, పెండ్యాల బన్ని, నాయకులు కండకర్ల అజయ్, శ్రావణ్, అన్వేష్ రఘు, ప్రదీప్, విద్యార్థులు పాల్గొన్నారు.