Irani Cup | ముకేష్ వికెట్ల వేట.. 30వసారి ‘ఇరానీ’ విజేతగా రెస్టాఫ్ ఇండియా..!
Irani Cup : భారత వన్డే జట్టులో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ (RishabhPant) దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. ఆటగాడిగా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించే పంత్ ఈసారి కెప్టెన్‌గా రెస్టాఫ్ ఇండియా (Rest Of India)కు టైటిల్ అందించాడు.
Irani Cup : భారత వన్డే జట్టులో చోటు కోల్పోయిన రిషభ్ పంత్ (RishabhPant) దేశవాళీ క్రికెట్లో సత్తా చాటాడు. ఆటగాడిగా ధనాధన్ బ్యాటింగ్‌తో అలరించే పంత్ ఈసారి కెప్టెన్‌గా రెస్టాఫ్ ఇండియా(Rest Of India)కు టైటిల్ అందించాడు. ఇరానీ కప్ (Irani Cup) ఫైనల్లో ముకేశ్ కుమార్(2-84, 33-6) ఎనిమిది వికెట్లతో విరచుకుపడగా.. పంత్ సారథ్యంలోని రెస్టాఫ్ ఇండియా 167 పరుగుల తేడాతో జమ్ము కశ్మీర్‌ను ఓడించింది. దాంతో రికార్డు స్థాయిలో ముప్పయ్యోసారి ట్రోఫీని ముద్దాడింది.
ఇరానీ ట్రోఫీ 2026-27 ఫైనల్లో రెస్టాఫ్ ఇండియా అదరగొట్టింది. రెండో ఇన్నింగ్స్‌లో ఓపెనర్ సనత్ సాంగ్వన్(55) అర్ధ శతకంతో శుభారంభమివ్వగా.. స్మరణ్ రవిచంద్రరన్(135) సూపర్ సెంచరీతో కదం తొక్కాడు. అనంతరం 279 పరుగుల ఛేదనలో జమ్ము కశ్మీర్ బ్యాటర్లను పేసర్ ముకేశ్ కుమార్ (2-84, 33-6) వణికించాడు.
Rest of India are Irani Trophy champions! 🏆🔥
Scorecard: https://t.co/UURSwEutlz https://t.co/WIYsvtxuDE
— Cricinfo (@cricinfo) October 4, 2026
బుల్లెట్ బంతులతో నిప్పులు చెరిగిన ముకేశ్ ఏకంగా ఆరుగుని ఔట్ చేసి ప్రత్యర్ధిని కోలుకోలేని దెబ్బతీశాడు. దాంతో.. జమ్ము 111 రన్స్‌కే కుప్పకూలింది. ఆల్‌రౌండ్ షోతో కనబరిచి 167 పరుగుల తేడాతో గెలుపొందిన రెస్టాఫ్ ఇండియా 30వ సారి ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచింది. తద్వారా జట్టుకు ట్రోఫీ కట్టబెట్టిన రెండో వికెట్ కీపర్‌గా పంత్ గుర్తింపు సాధించాడు. ఖతర్నాక్ శతకంతో విజయంలో భాగమైన స్మరణ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.
Birthday boy Rishabh Pant lifting the Irani Cup as captain 🐐
Fever tha, phir bhi trophy uthayi…
Yehi toh asli leader hota hai 💙
Tag a friend who is proud of Pant today 👇#RishabhPant #IraniCup https://t.co/x5mtTqPqVH
— CricketIndian_🇮🇳 (@CricketIndian_) October 4, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
Rajinikanth | రూ.600 కోట్ల క్లబ్‌లోకి ‘జైలర్ 2’.. 40 ఏళ్ల తర్వాత అభిమానులతో కలిసి సినిమా చూసిన రజనీకాంత్!
ACB Raid | ఏసీబీ వలలో జలమండలి ఉన్నతాధికారి.. రూ. 10 లక్షలు లంచం తీసుకుని వెళ్తుండగా అదుపులోకి?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

