HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
HanuMan 2 | టాలీవుడ్లో అందరినీ షాక్‌కి గురిచేస్తూ ‘హను-మాన్ 2’ (HanuMan 2) సినిమాపై ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది.
HanuMan 2 | టాలీవుడ్లో అందరినీ షాక్‌కి గురిచేస్తూ ‘హను-మాన్ 2’ (HanuMan 2) సినిమాపై ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ సంస్థ అధికారిక ప్రకటన చేసింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా, విభిన్న కథలతో ఆకట్టుకునే విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ పాన్-ఇండియా సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ‘హను-మాన్ 2 – ది రైజ్ ఆఫ్ వానరాస్’ (HanuMan 2 – The Rise of Vanaras) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు. గతంలో ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఊరు పేరు భైరవకోన’ వంటి ఫాంటసీ, థ్రిల్లర్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విఐ ఆనంద్, ఈసారి సరికొత్త పౌరాణిక ఫాంటసీ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
తాజాగా విడుదల చేసిన ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో కాషాయ వస్త్రం కట్టుకున్న వైష్ణవ్ తేజ్ కండలు తిరిగిన శరీరంతో వెనుకకు తిరిగి నిలబడి ఉండగా, ఒక భారీ హనుమంతుడి తోక ఆయనను చుట్టుకుని ఆకాశంలోకి ఎత్తుతున్నట్లుగా పోస్టర్‌ను ఎంతో ఆకట్టుకునేలా రూపొందించారు. మొదటి భాగం ‘హను-మాన్’ సినిమాను నిర్మించిన ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సీక్వెల్‌ను కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్-ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.
మరోవైపు, ఈ ప్రకటన ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది. మొదటి భాగం ‘హను-మాన్’కు దర్శకత్వం వహించిన ప్రశాంత్ వర్మ, ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రిషబ్ శెట్టి హీరోగా ‘జై హనుమాన్’ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ‘హను-మాన్’ కథ, సీక్వెల్ హక్కులు తమ నిర్మాణ సంస్థకే చెందుతాయని భావిస్తున్న ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్, ఇప్పుడు వైష్ణవ్ తేజ్ – విఐ ఆనంద్ కాంబినేషన్లో నేరుగా ‘హను-మాన్ 2’ ప్రకటించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండగా, ఇందులో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో వెల్లడించనుంది.
What began with a dream continues with an even bigger vision❤️🔥
Proud to take the legacy of #HanuMan forward with our next ambitious venture.
Presenting #HanuMan2 – THE RISE OF VANARAS 🔥
Looking forward to this exciting collaboration with #PanjaVaisshnavTej and the https://t.co/LXjrDhneEe
— Primeshow Entertainment (@Primeshowtweets) November 21, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HanuMan 2 | ప్రశాంత్ వర్మకు షాక్?.. వైష్ణవ్ తేజ్‌తో ప్రైమ్‌షో ‘హను-మాన్ 2’ అనౌన్స్మెంట్!
Running | రన్నింగ్‌తో కాళ్ల కండరాలు పెరుగుతాయా? కొవ్వు మాత్రమే తగ్గుతుందా?
Road Accident | పెళ్లి బృందం కారుకు ప్రమాదం.. నలుగురు దుర్మరణం
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని యాదాద్రికి పాదయాత్ర.. సింగాయిపల్లి నుంచి తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు
IND vs NZ | సెంచరీకి 2 పరుగుల దూరంలో గిల్ ఔట్.. భారత్‌కు 118 పరుగుల ఆధిక్యం!
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

