భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట ‘భోజన’ కార్మికుల ధర్నా
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ కార్మికులకు ఇస్తామన్న రూ.10 వేలతోపాటు గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
- అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
కొత్తగూడెం గణేష్ టెంపుల్, జూలై 23 : అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు భద్రాద్రి కలెక్టరేట్ ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ కార్మికులకు ఇస్తామన్న రూ.10 వేలతోపాటు గ్యాస్ సిలిండర్లు, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచడం లేదని, నెలల తరబడి ఆలస్యంగా వేతనాలు చెల్లిస్తున్నా విద్యార్థులకు ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో కార్మికులు వండి పెడుతున్నారని తెలిపారు.
కార్మికుల సమస్యలను పరిషరించకుండా ఇంటిగ్రేటెడ్/ సెంట్రలైజ్డ్ కిచెన్ విధానాలను ప్రోత్సహిస్తే వేలాది మంది విద్యార్థులు భోజనానికి దూరమవుతారని, కార్మికుల ఉపాధి ప్రమాదంలో పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని, లేదంటే పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అబ్దుల్ నబీ, పిట్టల అర్జున్, శ్రీనివాస్, మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మ, కార్యదర్శి ఎస్.సుల్తాన, వెంకటనర్సమ్మ, రామలక్ష్మి, కుమారి, సమ్మక, శైలజ, రాణి, నజ్మా, శివకుమారి, అనసూయ, యామిని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | మూవీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. వైజాగ్‌లో చిరంజీవి నయా ప్లాన్..!
ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగులకు క్వార్టర్స్ కేటాయింపు
Karikaala | ‘కరికాల’ నా కెరీర్ బెస్ట్ మూవీ అవుతుంది.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన సందీప్ కిషన్ పాన్-ఇండియా చిత్రం
‘విద్యుత్ భద్రతలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు’
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

