Curd | పెరుగును తినడంలో చాలా మందికి ఉండే అపోహలు ఇవే.. వైద్యులు ఏమంటున్నారంటే..?
చాలా మంది ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా తినే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ తో పాటు ప్రోటీన్, క్యాల్షియం, పేగు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా సమృద్దిగా ఉంటాయి.
Curd | చాలా మంది ఆహారంలో భాగంగా పెరుగును తీసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా విస్తృతంగా తినే ఆహారాల్లో ఇది కూడా ఒకటి. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ప్రోబయోటిక్స్ తో పాటు ప్రోటీన్, క్యాల్షియం, పేగు ఆరోగ్యానికి ఉపయోగపడే మంచి బ్యాక్టీరియా సమృద్దిగా ఉంటాయి. పెరుగు పేగు ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పెరుగు ఆరోగ్యానికి మేలు చేసేదే అయినప్పటికీ దీనిపై చాలా మంది అనేక సందేహాలను కలిగి ఉన్నారు. కనుక పెరుగు తీసుకోవడంపై ఉన్న అనేక అపోహల గురించి అలాగే వాటి వెనుక వాస్తవాల గురించి వైద్యులు ఏమంటున్నారో.. ఇప్పుడు తెలుసుకుందాం. పెరుగును తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది పేగులోని మంచి బ్యాక్టీరియాను సమతుల్యం చేస్తుంది.
దగ్గు, జలుబు వస్తాయా..?
పెరుగును తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయని చాలా మంది పెరుగుకు దూరంగా ఉంటారు. కానీ ఇది నిజం కాదని పెరుగు తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలు రావని వైద్యులు చెబుతున్నారు. అయితే సున్నితమైన శరీరతత్వం కలిగిన వారు చల్లటి పదార్థాలను తీసుకోవడం వల్ల వారికి కొద్దిగా సమస్య కలిగే అవకాశం ఉందని వైద్యులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా రాత్రి భోజనంలో కూడా చాలా మంది పెరుగును తీసుకోరు. కానీ ఆరోగ్యవంతులు రాత్రి భోజనంలో కూడా పెరుగు తీసుకోవచ్చని అయితే అది రాత్రి 7 గంటల లోపు తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక పాలు మంచివా, పెరుగు మంచిదా అనే సందేహం కూడా చాలా మందికి వస్తూ ఉంటుంది. జీర్ణక్రియ పరంగా పెరుగు చాలా మంచిదని పాల కంటే పెరుగు సులభంగా జీర్ణమవుతుందని కనుక పెరుగే సరైన ఎంపిక అని వైద్యులు చెబుతున్నారు.
డయాబెటిస్ ఉంటే తినవచ్చా..?
పెరుగు ఆమ్లత్వం కలిగిస్తుందని చాలా మంది భావిస్తారు. కానీ పెరుగు ఆమ్లత్వాన్ని తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అయితే బాగా పులిసిన పెరుగు మాత్రం కొద్దిగా ఆమ్లత్వం లక్షణాలను ప్రేరేపిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు. డయాబెటిస్ రోగులు పెరుగు తీసుకోకూడదని చాలా మంది పెరుగుకు దూరంగా ఉంటారు. పెరుగు తీసుకోవడంపై ఉన్న అపోహల్లో ఇది కూడా ఒకటి. అయితే చక్కెర లేని పెరుగు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ను కలిగి ఉంటుంది. కనుక చక్కెర లేకుండా డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు పెరుగును తీసుకోవచ్చు. అదే విధంగా పెరుగు కడుపు ఉబ్బరాన్ని కలిగించదు. లాక్టోజ్ అసహనత ఉన్న వారిలో మాత్రమే పెరుగు కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తుంది. పెరుగు తీసుకోవడంపై ఉన్న అతి పెద్ద అపోహల్లో ఒకటి చేపలతో పెరుగు తీసుకోకూడదని. కానీ ఇది నిజం కాదని చేపలు, చికెన్, మటన్ వంటి ప్రోటీన్ ఉన్న ఆహారాలతో పెరుగు తీసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అలాగే చాలా మంది బయట ప్యాకెట్ లలో లభించే పెరుగును తింటూ ఉంటారు. కానీ బయట లభించే పెరుగు కంటే ఇంట్లో తాజా పెరుగును తీసుకోవడమే మంచిది. రోజుకు సగటున ఒక కప్పు మోతాదులో పెరుగును తీసుకోవచ్చు. పాల సంబంధిత ఆహారాలను బాగా తట్టుకునే వారికి రోజూ పెరుగు తీసుకోవడం సురక్షితమేనని పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని కనుక దీనిని తీసుకునే ప్రయత్నం చేయాలని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- curd
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

