టెహ్రాన్: అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో హతమైన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే మరణించారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడిన 78 ఏళ్ల ఆమె చికిత్స పొందుతూ సోమవారం చనిపోయినట్ల ఇరాన్ మీడియా పేర్కొంది. (Khamenei’s wife dies) ఫిబ్రవరి 28న ఇరాన్ రాజధాని టెహ్రాన్, పరిపర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా వైమానిక దాడులు చేశాయి. ఇరాన్ సుప్రీం లీడర్ నివాసంపై బాంబులు వేయడంతో 84 ఏళ్ల అలయతుల్లా అలీ ఖమేనీ మరణించారు.
కాగా, ఈ దాడుల్లోనే ఖమేనీ కుమార్తె, అల్లుడు, మనవరాలు సహా పలువురు కుటుంబ సభ్యులు, ఆర్మీ అధికారులు, ఇతరులు చనిపోయారు. నాటి దాడుల్లో తీవ్రంగా గాయపడిన అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే సోమవారం మరణించారు. ఖమేనీ ఏకైక భార్య అయిన ఆమెతో 1964లో వివాహం జరిగింది.
Also Read:
US jets mistakenly shot down | కువైట్ ఆర్మీ పొరపాటు వల్ల.. మూడు ఫైటర్ జెట్లు కూలాయి: అమెరికా
Indian crew member killed | ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారతీయ మెరైన్ మృతి
Iran Targets Netanyahu’s Office | ‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’.. ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటన