Indian crew member killed | ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. భారతీయ మెరైన్ మృతి
Indian crew member killed | ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో భారతీయుడైన మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది. ఆయిల్ ట్యాంకర్‌లోని మిగతా సిబ్బందిని రెస్క్యూ చేసినట్లు పేర్కొంది.
మస్కట్: ఒమన్ తీరంలో ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి జరిగింది. ఆయిల్ ట్యాంకర్లో మంటలు చెలరేగాయి. ఈ దాడిలో భారతీయుడైన మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ ధృవీకరించింది. (Indian crew member killed) ఆయిల్ ట్యాంకర్‌లోని మిగతా సిబ్బందిని రెస్క్యూ చేసినట్లు పేర్కొంది. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ఇరాన్ ధీటుగా స్పందిస్తున్నది. ప్రతిదాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఒమన్ సముద్ర జలాల్లో ఉన్న మార్షల్ దీవులకు చెందిన ఆయిల్ ట్యాంకర్ ఎంకేడీ వియోమ్పై మార్చి1న డ్రోన్ దాడి జరిగింది. ప్రధాన ఇంజిన్ గదిలో పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి.
కాగా, ఆ ఆయిల్ ట్యాంకర్లో 21 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 16 మంది భారతీయులు, నలుగురు బంగ్లాదేశీయులు, ఒకరు ఉక్రేనియన్. అయితే డ్రోన్ బాంబు దాడి వల్ల జరిగిన పేలుడులో భారత్‌కు చెందిన ఒక మెరైన్ సిబ్బంది మరణించినట్లు ఒమన్ అధికారులు సోమవారం ధృవీకరించారు. మృతుడి వివరాలను వెల్లడించలేదు. ప్రాణాలతో బయటపడిన మిగతా వారిని పనామాకు చెందిన కార్గో షిష్‌లోకి తరలించినట్లు వివరించారు.
Also Read:
Iran Targets Netanyahu’s Office | ‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’.. ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటన
Watch: ఎఫ్-15 ఫైటర్ జెట్ క్రాష్.. అమెరికా యుద్ధ విమానాలు కూలాయన్న కువైట్
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- drone
- Hits
- Indian Crew
- Killed
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

