Watch: ఎఫ్-15 ఫైటర్ జెట్ క్రాష్.. అమెరికా యుద్ధ విమానాలు కూలాయన్న కువైట్
F-15 crashes | అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ సోమవారం ఉదయం కువైట్లో క్రాష్ అయ్యింది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూలినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే తామే కూల్చినట్లు ఇరాన్ పేర్కొంది.
కువైట్ సిటీ: అమెరికాకు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ సోమవారం ఉదయం కువైట్లో క్రాష్ అయ్యింది. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూలినట్లు కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. (F-15 crashes) అయితే తామే కూల్చినట్లు ఇరాన్ పేర్కొంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం మూడో రోజుకు చేరింది. సోమవారం ఉదయం ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్ కువైట్లో కూలిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఈ విషయాన్ని ధృవీకరించారు. అమెరికాకు చెందిన పలు యుద్ధ విమానాలు కూలినట్లు తెలిపారు. అయితే పైలట్లు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు వివరించారు. యూఎస్ ఫైటర్ జెట్స్ కూలడానికి కారణం ఏమిటన్నది తెలియలేదని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరోవైపు ఒక ఎఫ్-15 ఫైటర్ జెట్ను తాము కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో కువైట్లోని అమెరికా రాయబార కార్యాలయం నుంచి పొగలు వచ్చిన దృశ్యాలు కనిపించాయి.
అయితే పొరపాటున పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థ యాక్టివేట్ కావడంతో ‘ఫ్రెండ్లీ ఫైర్’ జరిగినట్లు పలు మీడియా సంస్థలు అనుమానం వ్యక్తం చేశాయి. దీంతో ఎఫ్-15 కూలినట్లు భావిస్తున్నారు. కాగా, యుద్ధ విమానాలు కూలడాన్ని అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇంకా ధృవీకరించలేదు.
F-15 fighter jet of US Air Force crashes in Kuwait as Iran claims strike pic.twitter.com/ZC7DryNir9
— JK24x7 News (@JK247News) March 2, 2026
Also Read:
Iran Raises Red Flag | ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. దీని అర్థం ఏమంటే?
CBSE Exams | పశ్చిమాసియా దేశాల్లో.. మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

