Iran Raises Red Flag | ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. దీని అర్థం ఏమంటే?
Iran Raises Red Flag | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఆ దేశం ఆగ్రహంతో రగిలిపోతున్నది. ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్న మసీదుపై ఎర్ర జెండా రెపరెపలాడింది.
టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఆ దేశం ఆగ్రహంతో రగిలిపోతున్నది. ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు మతపరంగా ప్రాముఖ్యత ఉన్న మసీదుపై ఎర్ర జెండా రెపరెపలాడింది. ఆదివారం ప్రసిద్ధ జాంకరన్ మసీదు గోపురంపై ఈ ప్రతీకార జెండాను ఎగురవేశారు. ఈ మసీదుపై ఎర్ర జెండా ఎగురవేయడాన్ని ప్రతీకారాన్ని సూచించే సంకేత చిహ్నంగా భావిస్తారు.
కాగా, ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్‌లపై ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. దీంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అలాగే ముస్లిం దేశాల్లో అయతుల్లా అలీ ఖమేనీకి మద్దుతుగా నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో శత్రువులపై పెరుగుతున్న కోపం, ప్రతీకారాన్ని ఈ ఎర్ర జెండా ప్రతిబింబిస్తుంది.

Red Flag Over Mosque
మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ ఆదివారం కీలక ప్రకటన చేశారు. తమ దేశ సాయుధ దళాలు శత్రు లక్ష్యాలపై దాడి చేస్తూనే ఉంటాయని స్పష్టం చేశారు. ఖమేనీ నిర్దేశించిన మార్గాన్ని ఇరాన్ అనుసరిస్తుందని తెలిపారు. ఆయన మరణం తర్వాత ఏర్పడిన నాయకత్వ మండలి తన పనిని ప్రారంభించిందని చెప్పారు. ప్రత్యర్థులపై ఇరాన్ బదులు తీర్చుకుంటుందని అన్నారు.
Also Read:
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Lucknow |ఇరాన్లో ఖమేనీ మృతి.. లక్నోలో నిరసనలకు పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
Bigg Boss 10 | ఆరో వారంలో నామినేషన్ల మంటలు.. రోహిత్ వర్సెస్ వంశీ, అమన్ వర్సెస్ ముకేశ్!
హరీశ్‌రావు మామకు హైకోర్టులో ఊరట.. హనుమంతరావు భూమి స్వాధీనంపై చర్యలొద్దని ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

