Alipur Village Mourns For Ayatollah | ఖమేనీ మరణంతో కర్ణాటక గ్రామంలో విషాదం.. అలీపూర్‌లో 3 రోజులు సంతాపం
Alipur Village Mourns For Ayatollah | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై కర్ణాటక గ్రామంలో విషాదం నెలకొన్నది. ఆ గ్రామంలో ఏకంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు.
బెంగళూరు: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం కమాండర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై కర్ణాటక గ్రామంలో విషాదం నెలకొన్నది. ఆ గ్రామంలో ఏకంగా మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. (Alipur Village Mourns For Ayatollah) ఆదివారం ఆ గ్రామ ప్రజలు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. బెంగళూరుకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న చిక్కబళ్లాపుర జిల్లాలోని అలీపూర్ గ్రామంతో అయతుల్లా అలీ ఖమేనీకి ఎంతో అనుబంధం ఉన్నది.
కాగా, అలీపూర్ గ్రామ జనాభాలో 99 శాతం మంది షియాలు ఉన్నారు. తమ పూర్వీకులు ఇరాన్ నుంచి ఇక్కడకు వచ్చి స్థిరపడినట్లు ఈ గ్రామ ప్రజలు నమ్ముతారు. చాలా గల్ఫ్ దేశాలతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ గ్రామంలోని చాలా మంది రత్నాల వ్యాపారం చేస్తారు. ఇరాన్‌తో సహా మధ్యప్రాచ్య దేశాలకు వాటిని ఎగుమతి చేస్తారు.
మరోవైపు 1986లో అలీపూర్ గ్రామానికి చెందిన వ్యాపారులు వాణిజ్యం కోసం తరచుగా ఇరాన్ వెళ్లేవారు. ఈ నేపథ్యంలో అయతుల్లా అలీ ఖమేనీకి మత గురువైన అయతుల్లా ఇమామ్ ఖమేనీ మత బోధనలకు వారు ప్రభావితులయ్యారు. దీంతో అలీపూర్ గ్రామంలో అయతుల్లా ఇమామ్ ఖమేనీ పేరు మీద ఒక ఇంటిని కూడా నిర్మించారు.
కాగా, 1986లో ఇరాన్ ప్రభుత్వం సహాయంతో నిర్మించిన ఆసుపత్రిని ప్రారంభించడానికి అయతుల్లా అలీ ఖమేనీ ప్రత్యేకంగా అలీపూర్ గ్రామాన్ని సందర్శించారు. నాటి నుంచి ఈ గ్రామ ప్రజలు ఖమేనీ బోధనలను మతపరంగా అనుసరించారు. అలీ టీవీ అనే స్థానిక టెలివిజన్ ఛానల్లో ఖమేనీ బోధనలను క్రమం తప్పకుండా ప్రసారం చేస్తారు.
అంతటి అనుబంధం ఉన్న అలీపూర్ గ్రామ ప్రజలు అయతుల్లా అలీ ఖమేనీ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా ఆదివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అలాగే మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించారు. తమ గ్రామంతో ఖమేనీకి ఉన్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు.
Is Khamenei more important than Kannadiga’s real issue ?? How can they announce bandh ??
How is Ayatollah Ali Khamenei so important to Karnataka that Alipur village in Gauribidanur Taluk, Chikkaballapur district, observed a three-day mourning, displayed black flags, closed… pic.twitter.com/6O1ebJETke
— Karnataka Portfolio (@karnatakaportf) March 1, 2026
Also Read:
Iran Flag Lowered | ఖమేనీ మృతికి సంతాపంగా.. ఢిల్లీలోని ఇరాన్ ఎంబసీలో జెండా అవనతం
Lucknow |ఇరాన్లో ఖమేనీ మృతి.. లక్నోలో నిరసనలకు పిలుపునిచ్చిన ముస్లిం సంఘాలు
CBSE Exams | పశ్చిమాసియా దేశాల్లో.. మార్చి 2న జరగాల్సిన పరీక్షలను సీబీఎస్ఈ వాయిదా
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

