Iran Targets Netanyahu’s Office | ‘నెతన్యాహు కార్యాలయంపై దాడి చేశాం’.. ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటన
Iran Targets Netanyahu’s Office | ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోమవారం తెలిపింది. ‘ఆశ్చర్యకరమైన’ క్షిపణి దాడి చేసినట్లు పేర్కొంది.
టెహ్రాన్: ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) సోమవారం తెలిపింది. ‘ఆశ్చర్యకరమైన’ క్షిపణి దాడి చేసినట్లు పేర్కొంది. (Iran Targets Netanyahu’s Office) ఇజ్రాయెల్ వైమానిక దళ కమాండర్ ఉన్న ప్రదేశాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని మిసైల్ ఎటాక్ చేసినట్లు వెల్లడించింది. తమ దాడుల తర్వాత నెతన్యాహుకు సంబంధించిన సమాచారం అస్పష్టంగా ఉన్నదని ఇరాన్ ఆర్మీ అధికారులు పేర్కొన్నారు. అయితే ఇజ్రాయెల్ దీనిపై ఇంకా స్పందించలేదు.
కాగా, ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యారు. దీంతో ఇరాన్ ప్రతీకార దాడులకు పాల్పడుతున్నది. ఇజ్రాయెల్‌తోపాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ, నేవీ బేస్‌లపై దాడులను ఉధృతం చేసింది.
మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్‌పై దాడులను తీవ్రం చేశాయి. ఇరాన్లో ఇప్పటి వరకు 555 మంది మరణించారు. ఉద్రిక్తతలు ప్రారంభమైనప్పటి నుంచి 131 నగరాలపై దాడులు జరిగినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది.
Also Read:
Watch: ఎఫ్-15 ఫైటర్ జెట్ క్రాష్.. అమెరికా యుద్ధ విమానాలు కూలాయన్న కువైట్
Iran Raises Red Flag | ఖమేనీ హత్య తర్వాత ఇరాన్ మసీదుపై ఎర్ర జెండా.. దీని అర్థం ఏమంటే?
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

