Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 388 పాయింట్లు పతనం
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయింది.
Stock Market : భారత స్టాక్ మార్కెట్ మంగళవారం నష్టాల్లో ముగిసింది. సోమవారం లాభాల్లో ముగిసినప్పటికీ.. మంగళవారం నష్టాల బాటలోనే సాగింది. మధ్యాహ్నం 3.30 గంటలకు ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 388 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయింది. ఉదయం ట్రేడింగ్ నష్టాల్లోనే ప్రారంభమైంది. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే ఉదయం సెన్సెక్స్ 320 పాయింట్లు తక్కువగా 78,204 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 94 పాయింట్ల నష్టంతో 24,490 వద్ద ప్రారంభమైంది. చివరకు బీఎస్ఈ సెన్సెక్స్ 388.19 పాయింట్ల (0.49 శాతం) నష్టంతో 78,154.25 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 112.10 పాయింట్లు (0.46 శాతం) నష్టంతో 24,471.70 వద్ద ముగిసింది. బ్రాడర్ మార్కెట్ మాత్రం మిశ్రమ ఫలితాల్ని సాధించింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 2.02 పాయింట్లు (0.01 శాతం) నష్టపోగా, బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సెలెక్ట్ ఇండెక్స్ 34.63 పాయింట్లు (0.38 శాతం) లాభాలు పొందింది. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 1.17 శాతం నష్టపోయింది. నిఫ్టీ రియాల్టీ 1 శాతం నష్టపోయింది. నిఫ్టీ ఫార్మా మాత్రం 1.02 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టైటాన్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎటర్నల్ లాభపడ్డాయి. ఎటర్నల్ అత్యధికంగా 2.01 శాతం లాభపడింది. మరోవైపు భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫైనాన్స్, ఇండిగో, అల్ట్రాటెక్ సిమెంట్, యాక్సిస్ బ్యాంక్ సంస్థలు నష్టాల్లో ముగిశాయి.
ముఖ్యంగా అల్ట్రాటెక్ సిమెంట్ సంస్థ 2.75 శాతం నష్టపోయింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో ట్రేడింగ్ నష్టాల్లో ముగిసింది. డాలర్‌తో రూపాయి మారక విలువ మరింత బలపడింది. మంగళవారం 15 పైసలు తగ్గిన రూపాయి 95.43 వద్ద కొనసాగుతోంది. ఉదయం 95.38 వద్ద ఓపెన్ కాగా, మధ్యలో 95.37కు చేరింది. చివరకు 95.43 వద్ద ముగిసింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 0.13 శాతం తగ్గి, 87.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- crude oil
- nifty
- Sensex
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

