కుభీర్ : మండలంలోని పల్సి గ్రామానికి చెందిన పెద్దకాపు శివలింగు (56) అనే వృద్ధుడు తన చేనులోని చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య ( Suicide ) చేసుకున్నట్లు ఎస్సై కృష్ణారెడ్డి ( Krishna Reddy ) తెలిపారు. మృతుడి భార్య రాధ ఫిర్యాదు మేరకు ఎస్సై తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివలింగు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆసుపత్రులకు వెళ్లిన ఫలితం లేకుండా పోయిందని వివరించారు
. దీంతో జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉదయం తన సొంత చేనులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.