హనుమకొండ చౌరస్తా, మార్చి 2: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు టీమ్‌ను ఎంపిక చేసినట్లు స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొఫెసర్ వై. వెంకయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో జరిగే మార్చి 3 నుంచి 4 వరకూ జరిగే ఈ పోటీలకు ముగ్గురిని పంపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ బెస్ట్ ఫిజిక్ (పురుషుల) పోటీలకు ఎంపికైన వారిలో విశ్వవిద్యాలయ వ్యాయమ కళాశాల నుంచి ఆర్.జగదీశ్, ఐ.రాంకిషోర్.. హనుమకొండ వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ నుంచి నిహాల్ సింగ్ ఉన్నట్లు ఆయన చెప్పారు. వీరికి కోచ్-కం-మేనేజర్‌గా వాగ్దేవి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వ్యాయమ అధ్యాపకుడు పి.కిషన్ వ్యవహరిస్తారని వెంకయ్య వెల్లడించారు.