ఓటరు సవరణను ఆరు నెలలు పొడిగించాలి
ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేదీతో గడువు ముగుస్తున్నదని, కానీ ఇప్ప టి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు.
- ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్
బేగంపేట్, జూలై 28: ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్ మారేడ్‌పల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు 3 వ తేదీతో గడువు ముగుస్తున్నదని, కానీ ఇప్ప టి వరకు 40 శాతం మాత్రమే పూర్తయిందని అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయని పేర్కొన్నారు. మరో ఆరు రోజుల వ్యవధిలో ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. ఈ ప్రక్రియ అం తా గందరగోళంగా ఉందని, సిబ్బంది కూడా సరిపడా లేరన్నారు. ఎస్ఐఆర్ వేగవంతం కావడానికి సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను ఎస్ఐఆర్ విధుల్లో భాగస్వామ్యం చేసే లా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించాలని కో రారు. ప్రత్యేక ఓటరు సవరణలో 2002 నాటి వివరాలతో ఇప్పుడు ఏం అవసరమని ప్రశ్నించారు. నూతన ఓటర్ల నమోదు, ఓటును మ రో ప్రాంతానికి మార్చుకునే అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రస్తుతం అవి చేయడం లేదన్నా రు. బూత్ లేవల్ ఏజెంట్ల సహకారంతోనే బీఎల్వోలు పని చేయగలిగారన్నారు. ఓటర్లు త మ బాధ్యతగా తమ పూర్తి వివరాలు నమోదు చేసి ఫారాలను బూత్ లెవల్ ఆఫీసర్లకు అందజేయాలని కోరారు. ఓటు తొలగించే పరిస్థితి రాకుండా చూసుకోవాలని సూచించారు. ఓటరు కార్డు గుర్తింపుగా కూడా ఉపయోగపడుతుదని తెలిపారు.
ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలి
ఎస్ఐఆర్ గడువు సమీపిస్తున్నందున ఇంటింటికీ వెళ్లి ఓటర్లు తమ వివరాలు సమర్పించేలా అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం మారేడ్‌పల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నియోజకవర్గ పార్టీ నాయకులతో ఎస్ఐఆర్పై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 3తో గడువు ముగుస్తుందని ఇప్పటి వరకు వివరాలు సమర్పించని ఓటర్లను గుర్తించి వారి ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఫారాలు సక్రమంగా అందజేయడం లేదని, కొరత ఉందని, పలువురు పార్టీ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫోన్ చేసి విషయాన్ని వివరించారు. బీఎల్వోల వద్ద సరిపడా ఫారాలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కమిషనర్ వివరించారు. ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్ మల్లిఖార్జున్‌గౌడ్, పార్టీ నాయకులు శ్రీనివాస్‌గౌడ్, శ్రీహరి, గుర్రం పవన్‌కుమార్‌గౌడ్, లక్ష్మీపతి, కిషోర్‌కుమార్, నాగులు, వెంకటేశం రాజు, మహేశ్‌యాదవ్, హన్మంతరావు, శేఖర్‌ముదిరాజ్, ఏసూరి మహేశ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

