Rahul Ramakrishna | నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో పూర్తి స్థాయి మాస్ పొలిటికల్ లీడర్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు టాలెంటెడ్ యాక్టర్ ప్రియదర్శి. సినిమాలో ఆయన నటనకు, ముఖ్యంగా ‘ఎమ్మెల్యే శంకరన్న’ పాత్రలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ని తలపించేలా ఆయన వేసిన గెటప్, డైలాగ్ డెలివరీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి.
ఈ నేపథ్యంలోనే ప్రియదర్శి నటనను అభినందిస్తూ నటుడు రాహుల్ రామకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ప్రియదర్శి బాపూ(కేసీఆర్).. ఇచ్చి పడేశినావు అంటూ ఆయనపై ప్రశంసలు కురిపించారు. దీనికి ప్రియదర్శి తనదైన శైలిలో మరింత ఫన్నీగా స్పందించారు. కేసీఆర్ గతంలో ఒక ప్రెస్ మీట్లో వాడిన ఫేమస్ టోన్‌ను గుర్తు చేస్తూ.. “ఏమయ్యా రాహుల్.. గిదా పద్ధతి? గొర్రెపిల్లని కొసి దావత్ ఇయ్యాలే అని రిప్లయ్ ఇచ్చాడు. ప్రియదర్శి-రాహుల్ రామకృష్ణ మధ్య సోషల్ మీడియాలో జరిగిన ఈ సరదా సంభాషణ ప్రస్తుతం నెట్టింటా వైరల్‌గా మారింది.
Em vy Rahulluuu
Gidha padhathi
Gorre pilla kosi dawat iyyale
🫂— Priyadarshi Pulikonda (@Preyadarshe) September 24, 2026