Yadadri dress code | యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్ తప్పనిసరి.. జూన్ 1వ తేదీ నుంచి అమల్లోకి..
Yadadri dress code | తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది.
Yadadri dress code : తెలంగాణలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు ఇకనుంచి డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది. నరసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. వివిధ సేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించే నియమం జూన్ 1 నుంచి అమల్లోకి రానుంది.
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం తర్వాత లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఆలయంలో ఇప్పటికే ఆలయ ఈవోతోపాటు సిబ్బంది కూడా డ్రెస్ కోడ్ను పాటిస్తున్నారు. హిందూ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా చర్యలు చేపట్టాలని యాదగిరిగుట్ట దేవస్థానం నిర్ణయించింది. నిత్య కల్యాణం, హోమం, జోడు సేవలు, శ్రీసుదర్శన నారసింహ హోమం, శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలు తదితర ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయ దుస్తులు ధరించేలా నియమాన్ని అమలు చేయనుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే యాదాద్రిలో కూడా భక్తుల వీఐపీ బ్రేక్ దర్శనానికి డ్రెస్ కోడ్ తప్పనిసరి చేసింది. స్వామి వారి బ్రేక్ దర్శనానికి వచ్చే భక్తులకు తప్పనిసరిగా ఈ నిబంధన వర్తిస్తుందని, అదేవిధంగా సాధారణ ధర్మ దర్శనం క్యూలైన్లో వచ్చే భక్తులకు ఈ నియమం నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో భాస్కర్ రావు తెలిపారు. ఆలయంలో జూన్ 1 నుంచి డ్రెస్ కోడ్ నియమాన్ని కచ్చితంగా అమలు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
కాగా, ఆలయంలో ఆధ్యాత్మికత, భక్తి భావాన్ని పెంచేందుకే ఇలాంటి నియమాలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు యాదాద్రీశుడి క్షేత్ర మహత్యం తెలిపేలా సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు, బోర్డులోనే క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫోన్లో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్షేత్ర మహత్మ్యం వివరాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని ఈవో భాస్కర్ రావు తెలిపారు. జూన్ 1వ నుంచి అమలయ్యే సంప్రదాయ వస్త్రధారణకు భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఉచిత విద్యుత్ కు ఎసరు పెట్టే కుట్ర.. రైతు డిస్కమ్ ఏర్పాటు జీవోపై హరీశ్రావు సీరియస్
Rahul Gandhi: రాహుల్ గాంధీ ‘సర్’ పిటీషన్లో 10 లోపాలు.. ఐడీ కార్డులు అడిగిన రిజిస్ట్రీ
Ranabaali | ‘రణబాలి’ నార్త్ అమెరికా ప్రీ సేల్స్ ఎంత .. విజయ్ దేవరకొండ సినిమాకు ఇంకా పెరగాల్సిందే!
Manthani | మంథనిలో అక్రమంగా తరలిస్తున్న 11 ఆవులు పట్టివేత
పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసుల దాడి.. ముగ్గురు అరెస్ట్.. రూ.17,300 నగదు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

