Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Guwahati Hotel Firing: గౌహతిలోని ఓ హోటల్ ప్రాపర్టీ విషయంలో జరిగిన ఫైరింగ్ ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు ఘనాకంట గగోయి పోలీసులు చెర నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో నిందితుడు హతమైనట్లు పోలీసులు చెప్పారు.
గౌహతి: అస్సాంలోని గౌహతిలోని ఓ హోటల్ ప్రాపర్టీ విషయంలో జరిగిన ఫైరింగ్(Guwahati Hotel Firing) ఘటనలో అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్రధాన నిందితుడు ఒకరు పోలీసులు చెర నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో జరిగిన కాల్పుల్లో ప్రధాన నిందితుడు హతమైనట్లు పోలీసులు చెప్పారు. కస్టడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన నిందితుడిని కాల్చినట్లు పోలీసులు వెల్లడించారు. తెల్లవారుజామున 3.10 నిమిషాలకు గౌరిసాగర్ వద్ద ఎన్కౌంటర్ జరిగింది.
మరో కేసులో శివసాగర్ జిల్లాకు అతన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ఎస్పీ పాపోరి చేతియా తెలిపారు. హోటల్ ఫైరింగ్ కేసులో ఏడు రోజుల పాటు పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఘనాకంట గగోయిని.. 2024 నాటి బ్యాంక్ ఫ్రాడ్ కేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. అయితే అక్కడకు అతన్ని తీసుకెళ్తున్న సమయంలో ఎన్కౌంటర్ జరిగింది. ప్రధాన నిందితుడు ఘనాకంట గగోయి .. శిక్షణ పొందిన షూటర్. రకరకాల ఆయుధాల్లో అతను నిపుణుడు.
పోలీసు వాహనం నుంచి దిగిన తర్వాత సర్వీస్ వెపన్ లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆ సయమంలో పోలీసులపై దాడి చేశాడతను. అయితే ఆఫీసర్‌ను రక్షించే క్రమంలో నిందితుడిపై కాల్పులు జరిపినట్లు ఎస్పీ చేతియా తెలిపారు. గాయపడ్డ గగోయిని ఆస్పత్రిలో చేర్పించారు. కానీ అతను మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

