Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
Luxury Watches Missing | సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తిరువనంతపురం: సుమారు వందకుపైగా కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయమయ్యాయి. కోర్టు కస్టడీలో ఉన్న విలువైన వస్తువులు కనిపించకపోవడంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Luxury Watches Missing) కేరళలోని ఎర్నాకులం జిల్లా కోర్టులో ఈ సంఘటన జరిగింది. ఒక కేసుపై విచారణ ముగిసిన తర్వాత కోర్టు కస్టడీలో ఉన్న రూ. 1.90 లక్షల విలువైన లగ్జరీ రాడో వాచ్‌ను తిరిగి తీసుకునేందుకు ఒక వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. కోర్టు అధికారులు ఆ వాచ్ కోసం స్ట్రాంగ్ రూమ్‌లో వెతికారు. అయితే అది కనిపించలేదు.
కాగా, కోర్టు అధికారుల ఆడిట్లో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మరో 123 కేసులకు సంబంధించిన ఖరీదైన వస్తువులు, ఇతర సాక్ష్యాధారాలు కూడా మాయమయ్యాయి. కనిపించని కస్టడీలోని వస్తువుల్లో ఎక్కువగా వివిధ బ్రాండ్లకు చెందిన లగ్జరీ, ఖరీదైన వాచీలు ఉన్నాయి. ఈ విషయం బయటపడటంతో జ్యుడీషియల్ కస్టడీలో ఉంచిన సాక్ష్యాల భద్రత, జవాబుదారీతనంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
మరోవైపు కోర్టు జూనియర్ సూపరింటెండెంట్ దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఎర్నాకులం పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు కస్టడీలోని విలువైన వాచ్‌లు, సాక్ష్యాధారాలైన ఇతర వస్తువులు ఎలా మాయమయ్యాయి అన్నది దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు స్ట్రాంగ్ రూమ్‌కు బాధ్యత వహించే ఉద్యోగి, కోర్టు సిబ్బందిని ప్రశ్నించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
Maxing | మ్యాక్సింగ్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా పాటించాలి.. దీని వల్ల కలిగే లాభాలేమిటి..?
AP Elections | రేపు ఏపీలో యథావిధిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు
NRI Died | శ్రీవారి మెట్టు నడక మార్గంలో గుండెపోటుతో ఎన్ఆర్ఐ భక్తుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

