Auto Drivers | కిస్తీ కడ్తవా? చస్తవా?.. ఆటోడ్రైవర్లకు ఫైనాన్షియర్ల తీవ్ర వేధింపులు
రోజురోజుకు ఆటోడ్రైవర్ల జీవన పరిస్థితి క్షీణిస్తున్నది. ఉచిత బస్సు స్కీంతో రోడ్డునపడ్డ ఆటోడ్రైవర్ల బతుకులు డేంజర్‌జోన్‌లో పడుతున్నాయి. ఓ వైపు గిరాకీ లేక ఇల్లు గడవటమే కష్టంగా మారుతున్న ఆటోవాలాలకు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని బిక్కుబిక్కుమంటున్నారు.
- అప్పు చెల్లించాలంటూ ఆటోల జప్తు.. అడిగితే రౌడీలతో దాడులు
- ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు.. ఈఎంఐలు కట్టలేక తిప్పలు
- మా మొర వినేవారేరి? వినతులకు దిక్కేది?.. బతకడమే భారమైంది
- ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్ సర్కారే.. ఆటోడ్రైవర్ల ఆవేదన
అతడి పేరు రాము. ఫైనాన్స్‌లో ఆటో కొన్నాడు. నెలనెలా రూ.8,500 ఈఎంఐ చెల్లిస్తున్నాడు. ఏడాది గడిచింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉచిత బస్సు ప్రవేశపెట్టడంతో గిరాకీ లేదు. దీంతో ఇల్లు గడవటమే కష్టంగా ఉన్న రాముకు ఈఎంఐ చెల్లించటం భారంగా మారింది. రెండు నెలల కిస్తీ చెల్లించకపోవటంతో ఫైనాన్షియర్లు వాళ్ల టీంలను పంపించి రామును బెదిరింపులకు గురిచేస్తున్నారు. కిస్తీ కడతావా? చస్తావా? అంటూ వేధిస్తున్నారు. ఆటోను వదిలేస్తే ఇన్ని రోజులు చెల్లించిన ఈఎంలు వృథా అయినట్టే. అప్పు తెచ్చి ఈఎంఐ చెల్లిస్తే మళ్లీ వాటిని తీర్చే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నాడు.
జాఫర్.. ఆటో ఈఎంఐ చెల్లించడం లేదని ఫైనాన్షియర్లు జప్తు చేశారు. అప్పటికే 14 ఈఎంఐలు చెల్లించిన అతడి బతుకు రోడ్డుపాలైంది. ఇంట్లో తన భార్య ఆభరణాలను కుదువపెట్టి డబ్బులు చెల్లించాడు. అయితే మూడు నెలలు ఆలస్యమైనందకు మొత్తం లోన్ మీద వడ్డీ, మూడు నెలల ఈఎంఐ, రౌడీషీటర్లకు రూ.5 వేల మామూళ్లు ఇలా ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. ఆటోపై ఆధారపడి బతికానని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదని వాపోయాడు.
Auto Drivers | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): రోజురోజుకు ఆటోడ్రైవర్ల జీవన పరిస్థితి క్షీణిస్తున్నది. ఉచిత బస్సు స్కీంతో రోడ్డునపడ్డ ఆటోడ్రైవర్ల బతుకులు డేంజర్‌జోన్‌లో పడుతున్నాయి. ఓ వైపు గిరాకీ లేక ఇల్లు గడవటమే కష్టంగా మారుతున్న ఆటోవాలాలకు ఇప్పుడు ఈఎంఐలు చెల్లించకపోతే చంపేస్తామంటూ బెదిరింపులు వస్తున్నాయని బిక్కుబిక్కుమంటున్నారు. నెలనెలా కిస్తీలు చెల్లించని వారికి ఆటోఫైనాన్షియర్ల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. మార్గంమద్యలోనే రోడ్డుపై ఆటో ఆపి డ్రైవర్‌ను బెదిరించటం, కొట్టడం లాంటివి చేస్తున్నారని వాపోతున్నారు.
రౌడీషీటర్లను పంపించి కిస్తీ కడుతావా? లేదా ఆటో గుంజుకుపోవాలా? అంటూ వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిరాకీ లేక రెండు నెలల కిస్తీలు కట్టలేకపోతే ఆటోలను గుంజుకపోతున్నారని, ఇన్నేండ్లు కట్టిన కిస్తీలు పనికిరాకుండా పోతున్నాయని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉచిత బస్సు స్కీం ప్రవేశపెడితే ఆటోడ్రైవర్లు నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇసుమంతైనా ఆలోచన చేయకపోవటం దురదృష్టకరం అని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి ఆటోవాలాలను ఆదుకోవాలని కోరుతున్నారు. ఆటోడ్రైవర్ల చావులకు కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆటోడ్రైవర్లంటే సీఎంకు ఎందుకు లెక్కలేదు
నెలకు రూ.9,500 ఈఎంఐ చెల్లించాలి. ఇవికాక ఇల్లు గడవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది ఈ కాంగ్రెస్ పాలనలో. సీఎం రేవంత్‌రెడ్డి అందరినీ సమానంగా చూడాలి. మా ఆటోడ్రైవర్లను ఎందుకు పట్టించుకోవటం లేదు? నాకు నలుగురు పిల్లలు. మరికొన్ని రోజుల్లో బడులు ప్రారంభం కాబోతున్నాయి. మా బాధలు వినేవారే కరువయ్యారు. ఫైనాన్షియర్లు డబ్బులు చెల్లించకపోతే కొడుతుండ్రు. గిరాకీయేమో లేదు. ప్రభుత్వం స్పందించి మా సమస్యలను పరిష్కరించాలె.
– సయ్యద్ జావెద్, ఆటోడ్రైవర్
చస్తే చావు.. ఈఎంఐ చెల్లించాల్సిందే అంటున్నారు
నాకు ఇద్దరు పిల్లలు. ఉపాధి కోసం మహబూబ్‌నగర్ నుంచి ఇక్కడికి వచ్చి పదేండ్ల నుంచి ఆటో నడుపుకుంటున్నా. నెలకు రూ.8 వేలు ఈఎంఐ చెల్లించాలి. నా ఆటోను రోడ్డుపై ఆపి నన్ను దించేసి బండి తీసుకెళ్లారు. మళ్లీ అప్పుజేసి ఆ డబ్బులు చెల్లించి వెనక్కి తెచ్చుకున్నా. అలా వెనక్కి తెచ్చుకోవడానికి వారి కమీషన్ డబ్బులు, వడ్డీ, ఈఎంఐలు చెల్లించాల్సి వచ్చింది. ఎలా చూసినా మాకు నష్టమే. ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించకపోతే డ్రైవర్లకు ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితే వస్తుంది.
– శివ, ఆటోడ్రైవర్
చెల్లించిన ఈఎంఐలు వృథా అయినట్టే
నెలకు రూ.13 వేల ఈఎంఐ చెల్లించాలి. గిరాకీ లేదు. ఏం చేయాలి? ఆటోను వదిలేసుకోవాలి. ఆటోను వదిలేస్తే బతకడం ఆపేయ్యాలి. ఎదుటి వ్యక్తికి ఏదైన చిన్న ఆపదొచ్చినా సాయం అందించే వ్యక్తులు ఉంటారు. కానీ ప్రభుత్వం ఇంత ఘోరంగా 4 లక్షల మంది ఆటోడ్రైవర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నది. ఇప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి పట్టించుకోకపోవటం దారుణం. ఇప్పటికే రూ.1.80 లక్షలు చెల్లించా. ఇప్పుడు ఈఎంఐ ఆలస్యం కావటంతో ఆటో గుంజుకుపోతే ఆ చెల్లించిన సొమ్మంతా వృథా అయినట్టే. మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
– అనిల్, ఆటోడ్రైవర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

