Rahul Gandhi | రాయ్‌బరేలిలోని పిపలేశ్వర హనుమాన్ ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
Rahul Gandhi | ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలి (Raebareli)లోని ఓ ఆలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సందర్శించారు.
Rahul Gandhi | ఉత్తరప్రదేశ్ రాయ్‌బరేలి (Raebareli)లోని ఓ ఆలయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సోమవారం సందర్శించారు. ప్రముఖ పిపలేశ్వర హనుమాన్ మందిర్ (Pipaleshwar Hanuman Mandir)ని సందర్శించిన రాహుల్ అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఐదో విడతలో భాగంగా రాయ్‌బరేలి లోక్‌సభ స్థానానికి ఇవాళ పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ స్థానం నుంచి లోక్‌సభ ఎంపీగా బరిలోకి దిగిన సందర్భంగా ఆయన ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. రాహుల్ వెంట పలువురు కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
#WATCH | Uttar Pradesh: Congress MP and candidate from Raebareli, Rahul Gandhi offers prayers at the Pipaleshwar Hanuman Mandir in Raebareli pic.twitter.com/iU5iqtCFUo
— ANI (@ANI) May 20, 2024
ఈ దశలో ఆరు రాష్ర్టాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 695 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు తేల్చనున్నారు. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, సాధ్వి నిరంజన్ జ్యోతి, జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్ సహా పలువురు కీలక నాయకులు కూడా ఉన్నారు. మొత్తం 94,732 పోలింగ్ స్టేషన్లలో 8.95 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ 49 స్థానాల్లో 40 స్థానాలు ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు కావడంతో బీజేపీకి ఈ దశ చాలా కీలకంగా మారింది. ఇక కాంగ్రెస్ యూపీలో ఇప్పటికీ బలంగా కనిపిస్తున్న రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో ఫలితాలపై అందరి ఆసక్తి నెలకొంది.
Also Read..
Delhi Metro | ఢిల్లీ మెట్రోలో యువతి బెల్లీ డ్యాన్స్.. VIDEO
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. మావోల దాడిలో జవాను మృతి
Rave Party | బెంగళూరులో రేవ్‌పార్టీ.. పట్టుబడిన తెలుగు సినీ ప్రముఖులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

