Purushaha Teaser | టైటిల్ ప్రకటించినప్పటి నుండే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది ‘పురుష’ (Purushaha). ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇస్తుండటంతో అటు ఇండస్ట్రీలో, ఇటు ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ నెలకొంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు కమెడియన్ సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ పూర్తి స్థాయి పాత్రల్లో నటిస్తున్నారు. వీరి ముగ్గురి కాంబినేషన్ హిలేరియస్ కామెడీని పంచబోతోంది. వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్ ఈ మూవీలో కథానాయికలుగా నటిస్తున్నారు. వెన్నెల కిశోర్, వీటీవీ గణేశ్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వర రావు ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ ‘పురుష’ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో నవ్వులు పూయిస్తుందో చూడాలి.