Vijayawada | విజయవాడలో అమానుష ఘటన చోటుచేసుకుంది. విద్యాబుద్ధులు చెప్పాల్సిన స్కూల్ టీచరే.. మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ పోశాడు. ఈ ఘటనలో చిన్నారి ప్రైవేటు పార్ట్స్‌కు తీవ్రగాయాలయ్యాయి.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో చదువుతున్న మూడేళ్ల చిన్నారి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు ఓ టీచర్ కాల్ చేసి చెప్పాడు. దీంతో హుటాహుటిన స్కూల్‌కు చేరుకున్న తల్లిదండ్రులు.. పాపను ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం చిన్నారిపై యాసిడ్ దాడి జరిగిందని నిర్ధారించారు. చిన్నారి ప్రైవేటు పార్ట్స్‌కు తీవ్ర గాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.
దీంతో సదరు స్కూల్ టీచరే చిన్నారిపై యాసిడ్ దాడి చేశాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సదరు టీచర్‌పై, స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడలోని స్కూల్లో మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి చేసిన టీచర్
నా పాపకు న్యాయం చేయండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్న తల్లి
విజయవాడలోని విద్యాధరపురం నేషనల్ స్కూల్లో మూడేళ్ల చిన్నారిపై యాసిడ్ దాడి చేసిన టీచర్
అనంతరం చిన్నారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి బాత్రూములో జారి పడిందని… https://t.co/6gGSXTYuud pic.twitter.com/d8FMiVo1Jx
— Telugu Scribe (@TeluguScribe) March 7, 2026