చండీఘడ్: జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి హత్య కేసులో జీవితకాల జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదీ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌ను పంజాబ్-హర్యానా కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఆ కేసులో ఆయన ఏడేళ్లుగా శిక్షను అనుభవిస్తున్నారు. శనివారం హైకోర్టు గుర్మీత్‌ను నిర్దోషిగా ప్రకటించింది. ఇదే కేసులో మరో ఇద్దరు చేసిన అప్పీల్‌ను కోర్టు తిరస్కరించింది. జస్టిస్ షీల్ నాగు, జస్టిస్ విక్రమ్ అగర్వాల్‌తో కూడిన ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. అయితే రేప్ కేసులో మాత్రం రామ్ రహీమ్ జైలు జీవితాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఈ కేసుకు చెందిన పూర్తి వివరాలు అందాల్సి ఉన్నది. 2002లో జర్నలిస్టు రామ్ చందర్ హత్యకు గురయ్యాడు.