Raja Shivaji | ‘ధురంధర్ 2’తో రాబోతున్న ‘రాజా శివాజీ’ టీజర్.!
Dhurandhar 2 | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' విడుదలకు సిద్ధమైంది.
Riteish Deshmukh | బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం మార్చి 19, 2026న తెలుగు, హిందీతో పాటు ప్రధాన భారతీయ భాషల్లో ఘనంగా విడుదల కానుంది. అయితే, ఈ సినిమా చూడటానికి వెళ్లే ప్రేక్షకులకు మేకర్స్ ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ‘ధురంధర్ 2’ థియేట్రికల్ రన్‌తో పాటు మరో రెండు క్రేజీ బాలీవుడ్ చిత్రాల టీజర్లను కూడా అటాచ్ చేయాలని జియో స్టూడియోస్ నిర్ణయించినట్లు తెలుస్తుంది.
రితేష్ దేశ్‌ముఖ్ దర్శకత్వంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. ఈ సినిమా టీజర్‌ను ధురంధర్ 2 స్క్రీనింగ్ సమయంలో ప్రదర్శించబోతున్నట్లు సమాచారం. మే 1న విడుదల కానున్న ఈ సినిమాలో అభిషేక్ బచ్చన్, సంజయ్ దత్, విద్యాబాలన్ వంటి దిగ్గజ తారలు నటిస్తున్నారు. వీటితో పాటు, షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న కలయికలో రాబోతున్న రొమాంటిక్ సీక్వెల్ ‘క్యాక్టెయిల్ 2’ టీజర్ కూడా ప్రేక్షకులను అలరించనుంది. సెప్టెంబర్ 2026లో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందిన ‘ధురంధర్ 2’ చిత్రానికి సెన్సార్ బోర్డు (CBFC) ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది. దాదాపు 3 గంటల 40 నిమిషాల సుదీర్ఘ నిడివితో వస్తున్న ఈ చిత్రం, ఒకే టికెట్‌పై మూడు భారీ సినిమాల విజువల్స్‌ను చూసే అవకాశాన్ని ప్రేక్షకులకు కల్పిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

