అమాయకత్వం అడుగుతోంది..
‘మోసమా.. మోసమా.. నువ్వు ఎక్కడ ఉంటావ్’?
మోసం-మీసం మెలేసి చెప్పింది-
‘నమ్మకం పక్కనే ఉంటాను’.. అని!
‘అవునా’..? అమాయకత్వం.. అమాయకపు ప్రశ్న.
‘నమ్మకం లేకపోతే ఎవర్నైనా నమ్మి చూడు’
నిమ్మళంగా చెప్పింది మోసం..
‘ఎప్పటికైనా గ్రహిస్తుంది లోకం’..
చెప్పింది అమాయకం
‘అందుకే నువ్వు వెర్రిమాలోకం’..
గట్టిగా నవ్వుతూ చెప్తోంది మోసం…
తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి
80085 77834