Manchu Manoj | ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాటు టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ పుట్టినరోజు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. అయితే మనోజ్ బర్త్డే సందర్భంగా ఆయన సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ వచ్చింది.
‘హను-మాన్’ వంటి బ్లక్ బస్టర్ తర్వాత టాలీవుడ్ యువకథానాయకుడు తేజ సజ్జా నటిస్తున్న తాజా చిత్రం మిరాయ్ (Mirai). మిరాయ్ అంటే ఫ్యూచర్ అని అర్థం. ఈ సినిమాకు ఈగల్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు మనోజ్ పుట్టినరోజు కానుకగా మూవీ నుంచి ఫస్ట్ లుక్తో పాటు గ్లింప్స్ విడుదల చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ చూస్తే.. బ్లాక్ స్వార్డ్ అనే పాత్రలో మనోజ్ నటిస్తుండగా.. అత్యంత ప్రమాదకరమైన విలన్గా కనిపించబోతున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత కొత్త లుక్లో దర్శనమిచ్చాడు మంచు మనోజ్.
The most talented actor turns into the Most Powerful Force in this world🔥
Presenting everyone’s favourite Rocking 🌟@HeroManoj1 in a Brand New Avatar in #MIRAI 💥#TheBlackSword GLIMPSE OUT NOW❤️🔥
– https://t.co/pX0dniHK0M#HBDManojManchu ✨
Superhero @tejasajja123… pic.twitter.com/nO0hpGWTA8
— BA Raju’s Team (@baraju_SuperHit) May 20, 2024
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మౌర్య సామ్రాజ్యపు రాజైన అశోకుడు కళింగ యుద్ధం అనంతరం పశ్చాతాపంతో యోగిగా మారతాడు. అయితే అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం ప్రస్తుతం ఆపదలో ఉంటుంది. తొమ్మిది గొప్ప గ్రంథాలతో సిద్ధం చేసిన ఆ అపార గ్రంథాన్ని దక్కించుకోవడం కోసం కొందరు దుండగులు ప్రయత్నిస్తుంటారు. అయితే ఈ గ్రంథాలను కాపాడడం కోసం ఒక యోధుడు ఉంటాడు. ఆ యోధుడే తేజ సజ్జా. ఇక గ్రంథాలను కాపాడడానికి తేజ ఏం చేశాడు. మంచు మనోజ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.