కారకాస్: మదురోను అరెస్ట్ చేయడానికి పనికొచ్చే సమాచారం ఇచ్చే వారికి పారితోషికాన్ని పెంచుతూ అమెరికా నిరుడు ఆగస్టులో ఓ ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో మదురో మాట్లాడుతూ, “రా నన్ను పట్టుకో. మీరాఫ్లోర్స్లో వేచి చూస్తున్నాను. ఆలస్యం చేయొద్దు, పిరికిపంద” అన్నారు.
వెనెజువెలా ప్రెసిడెన్షియల్ ప్యాలస్ పేరు మీరాఫ్లోర్స్. ఆయన అరెస్ట్ అనంతరం వైట్ హౌస్ విడుదల చేసిన ఓ వీడియోలో ఆయనను ఎగతాళి చేసింది. అమెరికా దాడుల సమయంలో మదురో సురక్షితమైన గదిలోకి పారిపోతుండగా లాక్కొచ్చి అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది.