Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Voters Turn Donors In Meghalaya | సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు హాజరయ్యే జనం డబ్బు, ఆహారం, మద్యం వంటివి ఆశిస్తుంటారు. అయితే ఆ రాష్ట్ర ప్రజలు ఇవేమీ ఆశించకుండా ప్రాంతీయ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. పైగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం వారే డబ్బును విరాళంగా ఇచ్చారు.
షిల్లాంగ్: సాధారణంగా రాజకీయ పార్టీలు నిర్వహించే సభలకు హాజరయ్యే జనం డబ్బు, ఆహారం, మద్యం వంటివి ఆశిస్తుంటారు. అయితే ఆ రాష్ట్ర ప్రజలు ఇవేమీ ఆశించకుండా ప్రాంతీయ పార్టీ సమావేశానికి హాజరయ్యారు. పైగా ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేయడం కోసం వారే డబ్బును విరాళంగా ఇచ్చారు. (Voters Turn Donors In Meghalaya) ఈ అరుదైన సంఘటన మేఘాలయలో జరిగింది. ఆ రాష్ట్రంలోని ప్రముఖ ప్రతిపక్ష పార్టీలలో వాయిస్ ఆఫ్ ది పీపుల్స్ పార్టీ (వీపీపీ) ఒకటి. రాజధాని షిల్లాంగ్‌లోని పోలో గ్రౌండ్లో ఒక బహిరంగ సభను ఆ పార్టీ నిర్వహించింది. తర్వలో జరుగనున్న లోక్‌సభ ఉప ఎన్నిక కోసం ప్రజా విరాళాల సేకరణ (క్రౌడ్ ఫండింగ్) కార్యక్రమాన్ని ప్రారంభించింది.
కాగా, వీపీపీ అధ్యక్షుడు, నాంగ్క్రెమ్ శాసనసభ్యుడు ఆర్డెంట్ మిల్లర్ బసాయావ్మోయిట్ నేతృత్వంలో జరిగిన ఈ సభకు సుమారు పది వేల మంది ప్రజలు హాజరయ్యారు. అయితే డబ్బు, ఆహారం, మద్యం వంటి ప్రలోభాల ద్వారా కాకుండా నమ్మకం, ప్రజాసేవ ద్వారా రాజకీయ మద్దతు పొందాలనే ఆలోచనతో వారు అక్కడకు వచ్చారు. ఆ పార్టీ అభ్యర్థి ఎన్నికల్లో పోటీ కోసం రూ. 3,07,000 విరాళంగా అందజేశారు. ఉచిత తాయిలాలు, డబ్బు వంటివి తమకు వద్దని ప్రజా విశ్వాసం, జవాబుదారీతనంపై ఆధారపడిన రాజకీయాలు తమకు ముఖ్యమని అక్కడి ప్రజలు చాటిచెప్పారు.
మరోవైపు ప్రజల కోసం పని చేయడమే తమ బాధ్యత అని వీపీపీ అధ్యక్షుడు బసాయోమోయిట్ తెలిపారు.
తమ పార్టీ రాజకీయ విధానం భిన్నమైనదని చెప్పారు. ‘ఇది ఒక ప్రత్యేకమైన పార్టీ. మా పార్టీ సమావేశాలకు హాజరయ్యేందుకు మేం ప్రజలకు డబ్బు ఇవ్వం. మద్దతుదారులకు భోజన ఏర్పాట్లు కూడా చేయం. వాస్తవానికి మేము ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తాం. ఎందుకంటే మేము కేవలం ప్రజా సేవకులమే. సేవకుడు తన యజమానికి డబ్బు చెల్లించాలని ఎలా ఆశిస్తారు? యజమాని (ప్రజలు) ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి, ఎందుకంటే మేం వారి కోసమే పనిచేస్తున్నాం. కాబట్టి వారు స్వయంగా వచ్చి పార్టీ నాయకుల ప్రసంగాలు వినాలి’ అని అన్నారు.
అయితే ఆర్థిక ప్రలోభాల ద్వారా కాకుండా ప్రజా సమస్యలు, నమ్మకం, ఓటర్లతో నిజమైన అనుబంధం ఆధారంగా ఎన్నికల పోరాటం జరుగాలని వీపీపీ అభ్యర్థి డాక్టర్ బాట్స్ఖెమ్ మిర్బో తెలిపారు. ప్రజాస్వామ్య సూత్రాలకు కట్టుబడే రాజకీయ పార్టీలు డబ్బు ఎరవేసే సామర్థ్యం ద్వారా కాకుండా, తమ పనితీరు, విధానాల ద్వారా ప్రజల మద్దతును పొందాలని ఆయన సూచించారు. ‘నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదా రాజకీయ విధానంలో, ఏ రాజకీయ పార్టీ అయినా ఓటర్లకు లంచం ఇవ్వడం చాలా తప్పు. భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉంటామని చెప్పే లేదా ప్రమాణం చేసే ఏ రాజకీయ పార్టీ అయినా వీపీపీ అనుసరిస్తున్న విధానాన్ని ఆదర్శంగా తీసుకోవాలి’ అని అన్నారు.
ఈ నమూనాను ఇతర రాజకీయ పార్టీలు కూడా అనుసరిస్తే, భారతదేశం అతి తక్కువ కాలంలోనే అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందనడంలో తనకు ఎలాంటి సందేహం లేదని మిర్బో తెలిపారు. 2028 అసెంబ్లీ ఎన్నికలలో కూడా తమ పార్టీ ఇదే విధానాన్ని కొనసాగిస్తుందని చెప్పారు. అదే తమ పార్టీ ప్రత్యేకత అని ఆయన స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- by polls
- contest
- Crowdfunds
- donors
RELATED ARTICLES
తాజా వార్తలు
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
Pawan Kalyan | చంద్రబాబును జైల్లో పెట్టినప్పుడు రోడ్లపైకి వచ్చింది జనసైనికులే!.. కూటమిలో జనసేనదే ఎక్కువ త్యాగం.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
RTC EU | అధికార పార్టీ మద్దతున్న కూటమిపై ఇ.యు ఘన విజయం అభినందనీయం : ఏపీ యూనియన్
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

