Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Dhruv Rathee : తనను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలను ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఖండించారు. జైలు నుంచి విడుదలైన ఆయన ఆదివారం వీడియో పోస్ట్‌లో తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు.
Dhruv Rathee : ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్(Gnanesh Kumar) రాజీనామా డిమాండ్ చేసినందుకు తనను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారనే వార్తలను ఆయన ఖండించారు. జైలు నుంచి విడుదలైన ఆయన ఆదివారం వీడియో పోస్ట్‌లో తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. గూండాలతో తనను కిడ్నాప్ చేయించారని రాఠీ నరేంద్ర మోడీ సర్కార్‌పై మండిపడ్డారు.
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) పిలుపు మేరకు జంతర్ మంతర్ వద్ద నిరసనలను అడ్డుకునే క్రమంలో ఢిల్లీ పోలీసులు ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొనాలనుకున్న రాఠీని గురుగ్రామ్‌లోని ఇంటి నుంచి తరలించారు. శనివారం ఇంట్లో ఉన్న ఆయనను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లారు. జైలు నుంచి విడుదలైన రాఠీ పోలీసులపై, ఓట్ చోరీకి పాల్పడుతున్న కేంద్రంపై భగ్గుమన్నారు.
I was not arrested or detained, I was KIDNAPPED.
Thank you for your support, here’s the full story 👇 https://t.co/gcN8cAUOmY
— Dhruv Rathee (@dhruv_rathee) October 11, 2026
ఆదివారం వీడియో పోస్ట్‌లో.. ‘నేను అరెస్ట్ కాలే. ఎవరూ నన్ను అదుపులోకి తీసుకోలే. నన్ను కిడ్నాప్ చేశారు. ఇంట్లో నిద్రిస్తున్న నన్ను 20మందికి పైగా గూండాలు కిడ్నాప్ చేశారు. నాకు మద్దతుగా నిలిచిన మీకు ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు. అంతేకాదు పోలీసులు తన పౌరసత్వంపై, ఆదాయంపై, భార్యా పిల్లల గురించి పలు ప్రశ్నలు అడిగారని చెప్పాడీ యూట్యూబర్. భారతీయ పౌరుడు కాదంటూ మీడియాలో తనపై ప్రచారమవుతున్న అసత్య కథనాలపైనా రాఠీ స్పందించారు. ‘ఇదుగోండి నా పాస్‌పోర్ట్. నేను భారతీయ పౌరుడిని. సాధారణ ప్రజల మాదిరిగానే నాకూ అన్ని హక్కులు ఉన్నాయి’ అని తన గురించి పదేపదే అబద్ధాలు వల్లెవేస్తున్న మీడియాకు రాఠీ కౌంటర్ ఇచ్చారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

