Blinkit Blinks | బ్లింకిట్‌ను కొసిరింది.. అందరికీ అందింది
అసలు కన్నా కొసరు ఎప్పుడూ గొప్పే! కూరగాయల దగ్గర కొసరు కబుర్లు అసలు బేరసారాలకన్నా పసందుగా సాగుతాయి. కిలోల కొద్దీ కూరగాయలు కొన్నప్పుడు కొసరుగా ఓ కొత్తిమీర కట్టో, కరివేపాకు రెమ్మో వేస్తేనే మనకు తృప్తి. కూరగాయలబ్బి ముఖం మాడ్చినా కొసరు దగ్గర రాజీపడని తత్వం మధ్యతరగతి అమ్మ సుగుణం! అలాంటి ఓ తల్లి ఏకంగా బ్లింకిట్నే కొసిరింది.
Blinkit Blinks | అసలు కన్నా కొసరు ఎప్పుడూ గొప్పే! కూరగాయల దగ్గర కొసరు కబుర్లు అసలు బేరసారాలకన్నా పసందుగా సాగుతాయి. కిలోల కొద్దీ కూరగాయలు కొన్నప్పుడు కొసరుగా ఓ కొత్తిమీర కట్టో, కరివేపాకు రెమ్మో వేస్తేనే మనకు తృప్తి. కూరగాయలబ్బి ముఖం మాడ్చినా కొసరు దగ్గర రాజీపడని తత్వం మధ్యతరగతి అమ్మ సుగుణం! అలాంటి ఓ తల్లి ఏకంగా బ్లింకిట్నే కొసిరింది. ముంబయికి చెందిన అంకిత్ సావంత్ బ్లింకిట్‌లో కూరగాయలు ఆర్డర్ ఇచ్చాడు. అందులో కొత్తిమీర కట్టకూ రేటు ఉండటం చూసి అతని తల్లి మనసు చివుక్కుమంది.
‘ఇన్నేసి రూపాయలు తగలేస్తూ.. కొత్తిమీరకూ లెక్కేంట’ని తనయుడిని కొరకొరలాడింది. అమ్మ ధర్మాగ్రహాన్ని అర్థం చేసుకున్న అంకిత్.. కొసరనివ్వకపోవడాన్ని నిరసనగా బ్లింకిట్ సీఈవోను ట్యాగ్ చేస్తూ ఎక్స్‌లో ఓ పోస్టు పెట్టాడు.‘బ్లింకిట్‌లో కొత్తిమీర కట్టకూ రేటు కట్టడం చూసి మా అమ్మకు చిన్నపాటి గుండెపోటు వచ్చినంత పనైంది’ అని పెదవి విరిచాడు.

అంతటితో ఆగకుండా “ఇంత మొత్తం వెచ్చించి కూరగాయలు తీసుకున్న వినియోగదారులకు ఉచితంగా కొత్తమీర కట్ట ఇస్తే బాగుంటుంద’ని మా అమ్మ సలహా’ అంటూ కొసరు మెసేజ్ పెట్టాడు. ఏ కలనున్నాడో గానీ, అంకిత్ పోస్టుకు అప్పటికప్పుడు స్పందించాడు బ్లింకిట్ సీఈవో అల్బిందర్ దిండ్సా. కూరగాయల ఆర్డర్‌పై 100 గ్రాముల కొత్తిమీరను కొసరుగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు.

అలా ఉచితంగా కొత్తిమీర పొందిన ఆర్డర్ స్క్రీన్ షాట్‌ను జతచేస్తూ.. ‘అంకిత్ అమ్మగారికి ధన్యవాదాలు చెప్పండి. కొత్తమీర కొసరు ఇవ్వడం మొదలైంది. రెండువారాల్లో మరింత పక్కాగా దీన్ని అమలు చేస్తాం’ అని పోస్టు పెట్టాడు. మొత్తంగా ఈ ముంబయి అమ్మ కోరిన కొత్తిమీర కొసరు అందరికీ అందడం విశేషం. అంకిత్, దిండ్సా ఎక్స్‌లో చేసిన పోస్టులు కొత్తిమీర పరిమళం కన్నా వేగంగా వైరల్ అయ్యాయి.
టాప్ టిప్..
- ఇంట్లో తయారు చేసిన సాస్, చట్నీలు మిగిలిపోతే, వాటిని ఎగ్ ట్రేలో గానీ, ఐస్ ట్రేలో గానీ వేసి ఒక గంట పాటు డీప్‌ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత క్యూబ్స్‌ని జిప్కవర్స్లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. అవసరం అనుకున్నప్పుడు వాటిని తీసుకొని వాడుకోవచ్చు. పదిరోజుల పాటు నిల్వ ఉంటాయి.

- ఫ్రిజ్‌లో పెట్టిన వెన్న వాడాలంటే, కనీసం గంటసేపు ముందు బయటపెట్టాలి. అలా చేయడం మర్చిపోతే, గడ్డకట్టిన వెన్నను ముక్కలుగా చేయాలి. అప్పుడు అవి పది నిమిషాల్లో మెత్తబడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

