Seattle Shooting : సియాటెల్ నగరం (Seattle City) లో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో మృతుల సంఖ్య మూడుకు పెరిగింది. మరో నలుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ‘బైట్ ఆఫ్ సియాటిల్ (Bite of Seattle)’ పేరుతో నగరంలో ఆహారోత్సవం నిర్వహించారు. నిన్న (ఆదివారం) సాయంత్రం సందడిగా ఆహారోత్సవం జరుగుతుండగా ఇద్దరు వ్యక్తులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకొన్నారు.
అయితే వారి తూటాలు గురితప్పి ఇతరులపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో ఓ యువకుడు (19), ఓ మహిళ (56) సహా మరో వ్యక్తి (44) మృతిచెందారు. గాయపడ్డవారి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. కాల్పులకు తెగబడిన ఇద్దరిలో ఒకరు లొంగిపోయారని, మరొకరు పరారీలో ఉన్నారని వెల్లడించారు. ఈ విషయాన్ని సియాటెల్ పోలీస్ అధికారులు వెల్లడించారు.