Uttar Pradesh | యూపీ వాసి ఖాతాలో 9,900 కోట్లు జమ!
యూపీలోని బాదోహి వాసి భానుప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాను చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు.
Uttar Pradesh | లక్నో, మే 19: యూపీలోని బాదోహి వాసి భానుప్రకాశ్ తన బ్యాంక్ ఖాతాను చూసి తన కళ్లను తానే నమ్మలేకపోయాడు. లక్ష, రెండు లక్షలు కాదు ఏకంగా 9,900 కోట్ల రూపాయలు తన ఖాతాలో జమవ్వడం చూసి షాక్ తిన్నాడు. వెంటనే తన ఖాతా ఉన్న బరోడా యూపీ బ్యాంక్‌కు వెళ్లి అధికారులకు ఈ విషయాన్ని తెలిపాడు. వారు కూడా అతని ఖాతాను పరిశీలించగా రూ.99, 99,94,95,999.99 నిల్వ ఉండటాన్ని గుర్తించారు.
సాంకేతిక కారణాల వల్ల ఆ మొత్తం అతని ఖాతాలో పడినట్టు గుర్తించి ముందు జాగ్రత్తగా అతని ఖాతాను స్తంభింప చేసి తప్పును సవరించారు. వాస్తవానికి భానుప్రకాశ్ది కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) లోన్ అకౌంట్ అని, కానీ కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా అతని ఖాతా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ (ఎన్పీఏ)గా మారిపోయిందని, దానిని సవరించామని బ్యాంక్ అధికారులు తెలిపారు. సకాలంలో దీని గురించి తమకు తెలియజేసిన ఖాతాదారుడు భానుప్రకాశ్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chandrababu | బాబు పగ.. రేవంత్ దగా.. రేవంత్ సర్కార్ పరోక్ష సహకారంతో రెచ్చిపోతున్న ఏపీ
Loksabha Elections | ఢిల్లీని పట్టినోడే బాద్షా.. జాతీయ పార్టీలతో కలబడితేనే తెలంగాణ నిలబడేది!
Horoscope | 28-11-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
చంపేయండి.. బెయిల్ ఇప్పిస్తా!
చిట్టెం చొరవతో జూరాల కాలువకు నీటి విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

