NRI | యూకే పార్లమెంట్ బరిలో తెలంగాణ బిడ్డ.. లేబర్ పార్టీ అభ్యర్థిగా పోటీ
NRI | బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో(UK Parliament elections) పోటీకి తెలంగాణ బిడ్డ ఎంపిక య్యాడు.
హైదరాబాద్ : బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో(UK Parliament elections) పోటీకి తెలంగాణ బిడ్డ ఎంపిక య్యాడు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోహెడ మండలం శనిగరం గ్రామానికి చెందిన ఉదయ్ నాగరాజు (NRI,Uday Nagaraju) లేబర్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో నిలుస్తున్నాడు. ఈ మేరకు లేబర్ పార్టీ(Labor Party) ‘నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్’(North Bedfordshire) పార్లమెంటరీ కాండిడేట్‌గా ఆ పార్టీ ప్రకటించింది. నార్త్ బెడ్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ప్రస్తుతం బ్రిటన్‌లో ఎన్నికల హడావిడి మొదలయింది.
రష్యా -ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్ -పాలస్తీనా సంఘర్షణ, ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోఈ ఎన్నికల మీద ప్రపంచ దేశాల దృష్టి కేంద్రీకృతమైంది. కాగా, శనిగరం గ్రామానికి చెందిన నాగరాజు హనుమంత రావు, నిర్మలాదేవి దంపతుల కుమారుడు ఉదయ్. చిన్నప్పటి నుంచే కష్టపడే తత్వం కలిగి ఉండే ఉదయ్ అంచెలంచెలుగా ఎదిగారు. బ్రిటన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ కాలేజీ అఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ చేసారు. భావితరాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావాన్ని ముందుగానే పసిగట్టి ఏఐ పాలసీ లాబ్స్ అనేథింక్-ట్యాంక్‌ను నెలకొల్పారు.
అంతర్జాతీయ వక్తగా, రచయితగా మంచి పేరు సంపాదించారు. క్షేత్రస్థాయి సమస్యలపైన ఉదయ్‌కు మంచి పట్టు ఉంది. స్కూల్ గవర్నర్‌గా, వాలంటీర్‌గా, రాజకీయ ప్రచారకుడిగా దశాబ్దకాలంగా ఇంటింటికీ ప్రచారంలో పాల్గొంటూ సామాన్యుల కష్టాలపై మంచి అవగాహన సాధించారు. వచ్చే ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు తేల్చి చెబుతున్నాయి. దీంతో తెలుగు ముద్దు బిడ్డ ఉదయ్ కూడా బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా ఘన విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

