Taiwan: తైవాన్ అధ్యక్షుడిగా విలియమ్ లయి ప్రమాణ స్వీకారం
Taiwan: తైవాన్ నూతన అధ్యక్షుడిగా విలియమ్ లయి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా నిలిపివేయాలని ఆయన తన తొలి ప్రసంగంలో కోరారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విక్టరీ సాధించారు. చైనా కవ్వింపు చర్యలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద సవాల్‌గా మారుతున్నట్లు ఆయన తెలిపారు.
తైపి: తైవాన్(Taiwan) నూతన అధ్యక్షుడిగా విలియమ్ లయి ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. తమ దేశంపై సైనిక చర్యలను చైనా నిలిపివేయాలని ఆయన తన తొలి ప్రసంగంలో కోరారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన ఎన్నికల్లో ఆయన విక్టరీ సాధించారు. చైనా కవ్వింపు చర్యలు ప్రపంచ శాంతి, సుస్థిరతకు అతిపెద్ద సవాల్‌గా మారుతున్నట్లు ఆయన తెలిపారు. అయితే తైవాన్ భూభాగం తమదే అని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. ఆ దేశంపై పదేపదే చైనా తమ మిలిటరీ సత్తాను వాడుతోంది.
తైపిలో ఉన్న ప్రెసిడెన్షియల్ ఆఫీసు బిల్డింగ్‌లో వేలాది మంది ప్రజల సమక్షంలో ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణస్వీకారోత్సవం తర్వాత మిలిటరీ మార్చ్నిర్వహించారు. ఫోక్ కళాకారులు కూడా ప్రదర్శన ఇచ్చారు. తైవాన్ జాతీయ జెండాతో మిలిటరీ హెలికాప్టర్లు ఫ్లా పాస్ట్ నిర్వహించాయి.
తైవాన్‌లో వైభవోపేత ప్రజాస్వామ్యం ఆసన్నమైందని లయి తెలిపారు. ప్రజాస్వామ్యం, శాంతి, సౌభ్రాతృత్వం తైవాన్‌లో భాగమన్నారు. తమ దేశం మానవ హక్కుల సూచీలో మెరుగు సాధించిందన్నారు.
తైవాన్‌పై రాజకీయంగా, మిలిటరీపరంగా బెదిరింపులు ఆపాలని చైనాను ఆయన కోరారు. అధ్యక్షుడు విలియమ్ లయి, ఉపాధ్యక్షులు సియా బి ఖిమ్ .. స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. పాటలు కూడా పాడారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

